Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsGoogle Meet | ఆడియోను టెక్ట్స్‌గా మార్చే ఫీచర్‌ తీసుకొస్తున్న గూగుల్‌

Google Meet | ఆడియోను టెక్ట్స్‌గా మార్చే ఫీచర్‌ తీసుకొస్తున్న గూగుల్‌

Google Meet | కరోనా తర్వాత లైఫ్‌స్టైల్‌ పూర్తిగా మారిపోయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ ఎక్కువైంది. ఆఫీసు మీటింగ్‌లోని గూగుల్‌ మీట్స్‌ ( Google meet ) భాషణను మీటింగ్‌ అయిపోయిన తర్వాత వినడమే కాదు.. ఇప్పుడు చదువుకోవచ్చు కూడా. దీనికోసం గూగుల్‌ కంపెనీ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.

మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌కు పోటీగా మీట్‌ తీసుకొచ్చిన గూగుల్‌ ( google ) .. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యాడ్‌ చేస్తుంది. ఇందులో భాగంగానే ట్రాన్స్‌స్క్రైబ్‌ అనే ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందంటే.. వీడియోకాల్‌ స్టార్ట్‌ అవ్వగానే దీన్ని ఆన్‌ చేయాలి. అప్పుడు వీడియో కాల్‌ ట్రాన్స్‌స్క్రైబ్ అవుతున్నట్లు ఆ కాల్‌లో ఉన్న యూజర్లకు తెలియజేస్తుంది. ఇక వీడియో కాల్‌ అవుతున్నంత సేపు ఆ సంభాషణలను ఇది రికార్డు చేస్తుంది. ఆ తర్వాత రికార్డయిన ఆడియోను టెక్ట్స్‌ రూపంలోకి మార్చి.. మీట్‌కు అనుసంధానంగా ఉన్న డ్రైవ్‌లోకి పంపిస్తుంది. ఆ ఫైల్స్‌ను వీడియో కాల్‌లో పాల్గొన్న సభ్యులందరూ యాక్సెస్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ వర్క్‌స్పేస్‌ కస్టమర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే సాధారణ యూజర్లు అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

సాంకేతికతో పుంజుకుంటున్న నేపథ్యంలో గూగుల్‌ ఎప్పటికప్పుడూ అప్‌డేట్‌ అవుతుంది. ఈ క్రమంలోనే గూగుల్‌ మ్యాప్స్‌లోనే స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను తీసుకొచ్చింది. హ్యాంగవుట్‌కు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా మరిన్ని అద్భుతమైన ఫీచర్లతో గూగుల్‌ చాట్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఈ ఫీచర్లతోనే కస్టమర్లకు రెండు యాప్స్‌ అందించడం ఎందుకని భావించిన గూగుల్‌.. స్ట్రీట్‌ వ్యూ, హ్యాంగవుట్‌ యాప్స్‌ సేవలను నిలిపివేసింది. వీటి సేవలను మ్యాప్స్‌, చాట్‌ యాప్‌ల్లోనే పొందవచ్చని తెలిపింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Aadhar Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Image Blur Tool in Whatsapp | ఫొటోలు పంపేందుకు సరికొత్త ఫీచర్.. ఇక ఆ యాప్‌లతో పనిలేదు

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Fact Check | 5G వ‌చ్చింద‌ని ఇండియాలో 3జీ, 4జీ మొబైల్స్‌ను ఆపేస్తున్నారా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News