Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsMobile Charging | మీ మొబైల్ ఛార్జింగ్ తొందరగా అయిపోతుందా? ఈ యాప్స్ ఉన్నాయేమో చెక్...

Mobile Charging | మీ మొబైల్ ఛార్జింగ్ తొందరగా అయిపోతుందా? ఈ యాప్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి

Mobile Charging | ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు అలర్ట్. మీ మొబైల్లో చార్జింగ్ తొందరగా అయిపోతుందా? ఎంత ఛార్జింగ్ పెట్టినా వెంటనే బ్యాటరీ డిశ్చార్జి అవుతుందా? అయితే అప్రమత్తమవ్వండి. వెంటనే మీ మొబైల్లో ఈ యాప్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్యాటరీ సామర్థ్యాన్ని తగ్గించి, డేటా వినియోగం ఎక్కువగా అయ్యేలా చేసే 16 యాప్లను ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫె గుర్తించింది. వెంటనే గూగుల్ను అలర్ట్ చేసింది. దీంతో సదరు ప్రమాదకరమైన యాప్లను గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఒకవేళ ఇప్పటికే ఆ యాప్స్ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఉంటే డిలీట్ చేసుకోవాలని సూచించింది.

తొలగించిన యాప్స్ ఇవే..

Busanbus, joycode, currency converter, High speed camera, smart task manager, flashlight+, k-dictionary, quick note, EzDica, Instagram profile downloader, EzNotes

ఈ యాప్స్ బ్యాటరీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

మెకాఫె కంపెనీ గుర్తించిన ఈ 16 యాప్స్ మొబైల్లో ఇన్స్టాల్ అవ్వగానే.. బ్యాక్గ్రౌండ్లో డేటాను యూజ్ చేసుకుంటుంది. ఇంటర్నెట్ సహాయంతో బ్యాక్గ్రౌండ్లో యాడ్స్ను ఓపెన్ చేయడమే కాకుండా వాటిని క్లిక్ చేస్తుంది. దీని వల్ల బ్యాక్గ్రౌండ్లో మొబైల్ వర్క్ అవుతుండటం వల్ల మొబైల్ ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. ప్రస్తుతానికి ఇవి మొబైల్ డేటానే ఉపయోగించుకుంటున్నప్పటికీ.. పర్సనల్ డేటాను తస్కరించే అవకాశమూ లేకపోలేదు. అందుకే వీటిని ప్రమాదకరమైన యాప్స్గా గుర్తించిన గూగుల్ వీటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి

Money Plant | మనీ ప్లాంట్‌ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News