Home Latest News T20 world cup winners | ఇప్పటివరకు టీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ అందుకున్న దేశాలు...

T20 world cup winners | ఇప్పటివరకు టీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ అందుకున్న దేశాలు ఇవే.. ఎక్కువ సార్లు విశ్వ విజేతగా నిలిచిన జట్టు ఏది ?

T20 world cup winners | క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ తర్వాత అభిమానులు ఆ స్థాయిలో ఎదురుచూసే టీ20 వరల్డ్‌ కప్‌ రానేవచ్చింది. ఇప్పటి వరకు ఈ పొట్టి కప్పు మొదలైనప్పటి నుంచి 7 సీజన్లే జరిగినా.. అభిమానులను మాత్రం విపరీతంగా అలరించింది. బ్యాటర్లు పరుగుల వరద పారించారు. గిర్రున తిరిగే బంతులను వేగంగా విసురుతూ.. క్లీన్‌ బౌల్డ్‌ చేసి రికార్డులు సృష్టించారు. మొత్తం మీద పొట్టి క్రికెట్‌ కప్‌లో సంచలన రికార్డులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు 7 సీజన్లలో విజేతలుగా ఎవరు నిలిచారు అనే విషయాన్ని పరిశీలిస్తే..

2007: 1983లో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత తొలిసారి ప్రపంచకప్‌ విజేతగా భారత్‌ నిలిచింది. 2007లో తొలిసారి జరిగిన T20 ప్రపంచకప్‌లో భారత్‌ విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్లో పాకిస్థాన్‌పై ధోనీ సేన విజయం సాధించింది.

2009: ఫస్ట్‌ టైం 2007లో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో భారత్‌పై పాకిస్థాన్‌ పరాజయం పాలై కొద్దిలో కప్‌ చేజార్చుకుంది. అయితే.. 2009లో మాత్రం ఫైనల్లో శ్రీలంకను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది.

2010: క్రికెట్‌కు పుట్టినిల్లు ఏదంటే ఠక్కున ఇంగ్లండ్‌ పేరు చెబుతారు. కానీ క్రికెట్‌ చరిత్రలో ఒక్కసారి కూడా వన్డే ప్రపంచకప్‌ను దక్కించుకోలేకపోయింది. అయితే.. ఆ కోరక 2010లో తీరింది. అయితే వన్డే ప్రపంచకప్‌లో కాదు.. టీ 20 ప్రపంచకప్‌లోనే. వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌లో అప్పటికే నాలుగు సార్లు కప్పు అందుకున్న ఆస్ట్రేలియాను ఫైనల్లో మట్టి కరిపించి ఇంగ్లండ్‌ T20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.

2012: రెండో టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై కొద్దిలో కప్‌ చేజార్చుకున్న శ్రీలంక.. 2012లో మరోసారి ఫైనల్‌కు చేరింది. ఎలాగైనా కప్పు గెలవాలనుకున్న శ్రీలంకకు వెస్టిండీస్‌ షాకిచ్చింది. ఫైనల్లో శ్రీలంకను ఓడించి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ప్రపంచకప్‌ మొదలైనప్పుడు వెస్టిండీస్‌పై అంచనాలు లేవు కానీ..
చివరి వరకు పోరాడి విశ్వ విజేతగా నిలిచింది. అంతకుముందు రెండు సార్లు వన్డే వరల్డ్‌ కప్‌ను వెస్టిండీస్‌ కైవసం చేసుకుంది.

2014: అంతకుముందు టీ20 వరల్డ్‌ కప్‌ నాలుగు టోర్నీలలో రెండు సార్లు ఫైనల్‌కు చేరినా.. కప్పును చేజార్చుకున్న శ్రీలంక ఎట్టకేలకు 2014లో పొట్టి క్రికెట్‌ కప్పును కైవసం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీలో బరిలో దిగిన శ్రీలంక.. ఫైనల్లో భారత్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది.

2016: అది 2016. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ పోటాపోటీగా తలపడుతున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి 6 బంతుల్లో వెస్టిండీస్‌ 19 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అందరూ ఇంగ్లండ్‌దే విజయం అనుకున్నారు. కానీ.. బ్రాత్‌ వైట్‌ చివరి ఓవర్లో చెలరేగిపోయాడు.. మొదటి నాలుగు బంతుల్లో సిక్సర్లు కొట్టి వెస్టిండీస్‌కు రెండో సారి టీ20 వరల్డ్‌ కప్‌ను అందించాడు.

2021: వన్డేల్లో ఐదు సార్లు ప్రపంచకప్‌ను సాధించిన ఆస్ట్రేలియాకు టీ20 వరల్డ్‌ కప్‌.. అప్పటి వరకు అందని ద్రాక్షే. కానీ 2021లో ఆ కలను నెరవేర్చుకుంది. 2010లో ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిన ఆసీస్‌.. 2021లో మాత్రం ఫైనల్లో న్యూజిలాండ్‌పై గెలిచి విశ్వవిజేతగా నిలిచింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Anklets | ఆడపిల్లలు కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి.. బంగారు పట్టీలు ధరిస్తే ఏమవుతుంది?

T20 world cup | తొలి మ్యాచ్‌లోనే సంచలనం.. పసికూన నమీబియా చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక

Exit mobile version