Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsDhoni | గేమ్‌ ప్లాన్‌ చేయడంలో అతడిని మించినవాళ్లు లేరు.. ధోనీపై ప్రశంసలు కురిపించిన డుప్లెసిస్‌

Dhoni | గేమ్‌ ప్లాన్‌ చేయడంలో అతడిని మించినవాళ్లు లేరు.. ధోనీపై ప్రశంసలు కురిపించిన డుప్లెసిస్‌

Dhoni | టైమ్‌ 2 న్యూస్‌, బెంగళూరు: వ్యూహాలు రచించడంలో భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని మించినవాళ్లు లేరని.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ అన్నాడు. ఐపీఎల్లో ధోనీ సారథ్యంలో ఆడటం తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడిందని ఫాఫ్‌ పేర్కొన్నాడు. కెరీర్‌ తొలినాళ్లలో గ్రేమ్‌ స్మిత్‌, స్టిఫెన్‌ ఫ్లెమింగ్‌, మహేంద్ర సింగ్‌ ధోనీని దగ్గరి నుంచి గమనించే అవకాశం దక్కడం తన అదృష్టమని.. వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. 2011-2015 వరకు, 2018 నుంచి 2021 వరకు ఐపీఎల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన డుప్లెసిస్‌ గతేడాది నుంచి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)కి సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్సీబీ పోడ్‌కాస్ట్‌తో డుప్లెసిస్‌ మాట్లాడుతూ.. తనకు ప్రారంభం నుంచి సారథ్యంపై ఉత్సుకత ఉందని.. అందుకే దిగ్గజాలను నిషితంగా గమనించేవాడిని అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ఈ స్థితిలో ఉన్నానంటే.. దాని వెనుక గ్రేమ్‌ స్మిత్‌, ఫ్లెమింగ్‌, ధోనీ కృషి ఎంతో ఉందని డుప్లెసిస్‌ అన్నాడు. ఈ నెల 31 నుంచి ఐపీఎల్‌-16వ సీజన్‌ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే జట్లు సన్నాహాలు మొదలెట్టాయి. ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరమైన ఈ సఫారీ స్టార్‌.. ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను నాయకుడిగా ఎదగడంలో పరోక్షంగా ధోనీ తోడ్పాటు ఉందన్నాడు.

‘తొలిసారి దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఎంపికైన సమయంలో సఫారీ టీమ్‌కు దిగ్గజ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ సారథ్యం వహిస్తున్నాడు. అప్పుడు అతడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాట్లాడే విధానం నాపై చాలా ప్రభావం చూపింది. లీడర్‌ అంటే ఎలా ఉండాలో స్మిత్‌ను చూసి నేర్చుకున్న. అతడి మాటలు నాపై మంత్రాల్లా పనిచేసేవి. నేనే కాదు.. డ్రెస్సింగ్‌ రూమ్‌లోని మిగిలిన వాళ్లు కూడా అతడు మాట్లాడుతుంటే చూస్తూ ఉండిపోయేవాళ్లు. అప్పటి నుంచే నాయకులను దగ్గర నుంచి పరిశీలించడం ప్రారంభించా. ఐపీఎల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుతో చేరినప్పుడు ఫ్లెమింగ్‌ను గమనించా. న్యూజిలాండ్‌ తరఫునే కాక.. ప్రపంచలోనే అతడో ఉత్తమ సారథి. అలాంటి వ్యక్తి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. వనరులను వాడుకోవడం ఎలాగో అతడికి తెలిసినంత బాగా మరొకరి తెలియదేమో. పరిచయాలతో పనులు ఎలా చేయించుకోవాలో ఫ్లెమింగ్‌కు బాగా తెలుసు. తొలిసారి చెన్నై డ్రెస్సింగ్‌ రూమ్‌లో అడుగుపెట్టినప్పుడు ఫ్లెమింగ్‌ పక్కనే కూర్చున్నా. సారథ్యానికి సంబంధించిన ప్రశ్నలతో అతడిని విసిగించా. ఇక మైదానంలో అడుగుపెట్టాక ధోనీ గొప్పతనమేంటో తెలిసింది. క్షణాల్లో మారిపోయే టీ20ల్లో మ్యాచ్‌ను చదవడం ఎలాగో ధోనీని చూసి నేర్చుకోవాలి’ అని డుప్లెసిస్‌ అన్నాడు. గత సీజన్‌కు ముందు విరాట్‌కోహ్లీ.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా తప్పుకోగా.. అతడి స్థానంలో ఆర్సీబీ డుప్లెసిస్‌ను నాయకుడిగా నియమించిన విషయం తెలిసిందే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

ICC Rankings | అగ్రస్థానానికి భారత ఆఫ్‌ స్పిన్నర్‌.. ఐసీసీ టాప్‌ ర్యాంక్‌ దక్కించుకున్న రవిచంద్రన్‌ అశ్విన్‌

Jasprit Bumrah | ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ సీజన్‌కు దూరమైన స్టార్ పేసర్..

Lionel Messi | రోనాల్డోను సమం చేసిన అర్జెంటీనా సాకర్ దిగ్గజం.. ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా లియోనల్ మెస్సీ

NZ vs ENG | కివీస్‌ కొత్త చరిత్ర.. ఫాలోఆన్‌ నుంచి కోలుకొని ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌

Sachin Tendulkar | సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం.. వాంఖడేలో మాస్టర్ నిలువెత్తు విగ్రహం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News