Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLatest NewsT20 world cup | టీ20 ప్రపంచకప్ లో మరో సంచలనం.. టైటిల్ ఫేవరెట్ ఇంగ్లాండ్...

T20 world cup | టీ20 ప్రపంచకప్ లో మరో సంచలనం.. టైటిల్ ఫేవరెట్ ఇంగ్లాండ్ కు ఐర్లాండ్ షాక్

T20 world cup | టీ20 ప్రపంచకప్‌లో పసికూనలు చెలరేగిపోతున్నాయి. తొలి మ్యాచ్‌లో నమీబియ చేతిలో శ్రీలంక కంగుతింది. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ చేతిలో వెస్డిండీస్‌ దారుణంగా ఓడిపోయింది. అటు ఐర్లాండ్‌ చేతిలోనూ దారుణంగా ఓడి ఇంటి బాట పట్టింది. గ్రూప్‌ స్థాయిలో మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడి.. రెండింటిలోనూ ఓడిపోయి ఇంటిబాట పట్టింది. తాజాగా టైటిల్‌ ఫేవరెట్‌ ఇంగ్లాండ్‌కు కూడా ఐర్లాండ్‌ షాకిచ్చింది. వరుణుడు కూడా సాయం చేయడంతో విజయం సులభమైంది.

గతంలో 2011 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్‌ తొలిసారి విజయం సాధించింది. ఇప్పుడు 11 ఏండ్ల తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు షాకిచ్చింది ఐర్లాండ్‌. వర్షం కారణంగా డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read More : T20 world cup records | టీ20 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డులు ఇవే.. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న క్రికెటర్‌ ఎవరంటే ?

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 19.2 ఓవర్లకు 157 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. బిల్‌ బిర్నీ చెలరేగి ఆడాడు. 47 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. మరోవైపు టకర్‌ కూడా ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుపడ్డాడు. 27 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 34 పరుగులు చేశాడు. వీరిద్దరూ చెలరేగడంతో ఐర్లాండ్‌ భారీ స్కోరు చేయగలిగింది.

Read more: T20 world cup winners | ఇప్పటివరకు టీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ అందుకున్న దేశాలు ఇవే.. ఎక్కువ సార్లు విశ్వ విజేతగా నిలిచిన జట్టు ఏది ?

అటు ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కు దిగిన తర్వాత వరుణుడి కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్‌ 14.3 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేయగలిగింది. ఆదిలో తడబడినా చివరకు పుంజుకున్న ఇంగ్లాండ్‌ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ ఆగిపోయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు.

ఆట నిలిచిన సమయానికి చేయాల్సిన పరుగుల (110)కంటే ఇంగ్లాండ్‌ ఐదు పరుగులు వెనకబడిపోయింది. దీంతో విజయం ఐర్లాండ్‌ను వరించింది. మొదటి రౌండ్లో సంచలన విజయం నమోదు చేసి వెస్టిండీస్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్‌కు రెండో రౌండ్లో ఇదే తొలి విజయం కావడం గమనార్హం.

ఇంగ్లాండ్ కు t20 ప్రపంచకప్ ఎప్పుడు వచ్చింది?

2010: క్రికెట్‌కు పుట్టినిల్లు ఏదంటే ఠక్కున ఇంగ్లండ్‌ పేరు చెబుతారు. కానీ క్రికెట్‌ చరిత్రలో ఒక్కసారి కూడా వన్డే ప్రపంచకప్‌ను దక్కించుకోలేకపోయింది. అయితే.. ఆ కోరక 2010లో తీరింది. అయితే వన్డే ప్రపంచకప్‌లో కాదు.. టీ 20 ప్రపంచకప్‌లోనే. వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌లో అప్పటికే నాలుగు సార్లు కప్పు అందుకున్న ఆస్ట్రేలియాను ఫైనల్లో మట్టి కరిపించి ఇంగ్లండ్‌ T20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.

Follow Us : FacebookTwitter

Read more articles | 

Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

vaasthu tips | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

Change Name in Aadhar | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా.. ఏమేం డాక్యుమెంట్లు అవసరం?

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Dengue Fever | డెంగీ జ్వరం వస్తే నొప్పి మాత్రలు ఎందుకు వేసుకోవద్దు ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News