Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsT20 world cup | రెండు సార్లు ప్రపంచకప్ విజేతను ఇంటికి పంపించిన ఐర్లాండ్.. వెస్టిండీస్...

T20 world cup | రెండు సార్లు ప్రపంచకప్ విజేతను ఇంటికి పంపించిన ఐర్లాండ్.. వెస్టిండీస్ కు ఘోర పరాభవం

t20 world cup | రెండు సార్లు పొట్టి ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ ( west indies ) కథ తొలిరౌండ్ లోనే ముగిసిపోయింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పసికూన ఐర్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయి ఇంటి బాట పట్టింది.

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మూడు మ్యాచ్ లు ఆడిన వెస్టిండీస్ రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. కేవలం ఒక్క మ్యాచ్ లో గెలిచి ఇంటి ముఖం పట్టింది. తొలిమ్యాచ్ లో స్కాట్లాండ్ చేతిలో ఓడిన వెస్టిండీస్ తాజాగా ఐర్లాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేయగలిగింది. బ్రాండన్ కింగ్ 48 బంతుల్లో 62 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.

Read More : T20 world cup records | టీ20 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డులు ఇవే.. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న క్రికెటర్‌ ఎవరంటే ?

అనంతరం 147 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. విండీస్ బౌలర్లు.. ఐర్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో తేలిపోయారు. ఐర్లాండ్ తరఫున పాల్ స్టిర్లింగ్ 48 బంతుల్లో 66 పరుగులు చేసి విజయంలో కీలకంగా నిలిచాడు. ఐర్లాండ్ కెప్టెన్ బల్బిర్నీ 37 పరుగులు చేయగా.. టకర్ 45 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

Read more: T20 world cup winners | ఇప్పటివరకు టీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ అందుకున్న దేశాలు ఇవే.. ఎక్కువ సార్లు విశ్వ విజేతగా నిలిచిన జట్టు ఏది ?

బ్యాటింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై విండీస్ బ్యాటర్లు తొలుత పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. విండీస్ కెప్టెన్ పూరన్ 13 పరుగులకే ఔటై నిరాశ పరిచాడు. అదే ఐర్లాండ్.. విండీస్ బౌలర్లను చీల్చి చెండాడింది. రెండు సార్లు ప్రపంచకప్ ను గెలిచిన వెస్టిండీస్ ను తొలి రౌండ్ లోనే ఇంటికి పంపించింది.

ఐర్లాండ్ కు ఇది ఏడో ప్రపంచకప్. ఇప్పటివరకు ఆ జట్టు సూపర్ 8 కు చేరడం ఇది రెండో సారి మాత్రమే. 2009లో మొదటిసారి తొలి రౌండ్ దాటింది.

స్కాట్లాండ్ పై జింబాబ్వే విజయం

మరోవైపు సూపర్ 12లో జింబాబ్వే బెర్తు ఖరారు చేసుకుంది. ఐదు వికెట్ల తేడాతో స్కాట్లాండ్ ను జింబాబ్వే ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. అనతరం 133 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వే ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.

west indies ఎప్పుడు ప్రపంచకప్ గెలిచింది

2012: రెండో టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై కొద్దిలో కప్‌ చేజార్చుకున్న శ్రీలంక.. 2012లో మరోసారి ఫైనల్‌కు చేరింది. ఎలాగైనా కప్పు గెలవాలనుకున్న శ్రీలంకకు వెస్టిండీస్‌ షాకిచ్చింది. ఫైనల్లో శ్రీలంకను ఓడించి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ప్రపంచకప్‌ మొదలైనప్పుడు వెస్టిండీస్‌పై అంచనాలు లేవు కానీ.. చివరి వరకు పోరాడి విశ్వ విజేతగా నిలిచింది. అంతకుముందు రెండు సార్లు వన్డే వరల్డ్‌ కప్‌ను వెస్టిండీస్‌ కైవసం చేసుకుంది.

2016: అది 2016. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ పోటాపోటీగా తలపడుతున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి 6 బంతుల్లో వెస్టిండీస్‌ 19 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అందరూ ఇంగ్లండ్‌దే విజయం అనుకున్నారు. కానీ.. బ్రాత్‌ వైట్‌ చివరి ఓవర్లో చెలరేగిపోయాడు.. మొదటి నాలుగు బంతుల్లో సిక్సర్లు కొట్టి వెస్టిండీస్‌కు రెండో సారి టీ20 వరల్డ్‌ కప్‌ను అందించాడు.

Follow Us : FacebookTwitter

Read more articles | T20 world cup | రెండు సార్లు ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ కు షాకిచ్చిన స్కాట్లండ్

T20 world cup | రికార్డు సృష్టించిన యూఏఈ స్పిన్నర్.. అయినా శ్రీలంక చేతిలో ఓటమి తప్పలేదు

vaasthu tips | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News