Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentUnstoppable with NBK | ఆహాలో అన్ని రికార్డులు హాంఫట్.. బాలకృష్ణ దెబ్బకు రికార్డులన్నీ...

Unstoppable with NBK | ఆహాలో అన్ని రికార్డులు హాంఫట్.. బాలకృష్ణ దెబ్బకు రికార్డులన్నీ ఫసక్..

Unstoppable with NBK | అన్ స్టాపబుల్ పేరుకు తగ్గట్టే బాలయ్య టాక్ షో దూసుకుపోతుంది. మొదటి సీజన్ మొత్తానికి వచ్చిన రెస్పాన్స్ కంటే రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ కు వచ్చిన రెస్పాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు కేవలం సినిమా వాళ్లతోరి మాత్రమే మొదలుపెట్టిన బాలయ్య ఇప్పుడు ఏకంగా నారా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ గెస్ట్లుగా ఫస్ట్ ఎపిసోడ్ మొదలు పెట్టడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ టాక్ షో మోస్ట్ టాకీటివ్ షోగా మారిపోయింది.

ఏ నలుగురు కలిసినా కూడా అరే మొన్న బాలకృష్ణ షోలో ఏం జరిగిందో చూసావా.. వాళ్లేం మాట్లాడుకున్నారో విన్నావా అంటూ చర్చించుకుంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా 1995 ఎన్టీఆర్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవడంతో ఈ ఎపిసోడ్ బాగా హైలైట్ అయింది. ఆరోజు ఏం జరిగిందో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ షోకు చంద్రబాబు నాయుడును పిలిచినట్టు అనిపిస్తుంది.

Read more: Junior NTR | ఎన్టీఆర్ 30 ఎంతవరకు వచ్చింది.. కొరటాల సినిమాపై జూనియర్ ఏమంటున్నాడు..?

27 ఏళ్లుగా వెన్నుపోటు రాజకీయ దారుడు అంటూ చంద్రబాబుపై ఉన్న ఆ ముద్రను తొలగించడానికి బావమరిది బాలకృష్ణ తన వంతు ప్రయత్నం చేశాడని.. ఈ షో చూసిన వాళ్లకు ఎవరికైనా అర్థమవుతుంది. అప్పుడు జరిగిన దానిలో బాబు తప్పు ఏమీలేదని.. ఒక నందమూరి కుటుంబ సభ్యుడిగా ఇది నేను చెప్తున్నాను అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతుంది.

ఈ ఎపిసోడ్ గురించి తెలుగుదేశం కంటే వైసీపీ నాయకుల ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీన్నిబట్టి అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ అర్థం అయిపోతుంది అంటున్నారు నిర్వాహకులు. నిజానికి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ దేనికి వచ్చింది.

Read more: vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

కేవలం 24 గంటల్లోనే 10 లక్షల వ్యూస్ అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ కు వచ్చింది. ఆహా మొదలైన ఈ మూడేళ్లలో ఇప్పటివరకు ఈ స్థాయి రెస్పాన్స్ తీసుకొచ్చిన షో లేదు. ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదు. బాలయ్య హోస్టింగ్.. చంద్రబాబు మనసులో మాట.. లోకేష్ మాటల గారడీ ఇవన్నీ కలిపి అన్ స్టాపబుల్ సీజన్ 2కు అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాయి. మరి ఈ జోరు ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Mulayam singh yadav | ఆ రెజ్లింగ్‌ టోర్నీ ములాయం సింగ్ యాదవ్ దశాదిశను మార్చేసింది. . లేదంటే రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదా?

Filmfare awards 2022 | త‌గ్గేదేలే.. ఫిలింఫేర్ అవార్డుల్లో స‌త్తా చాటిన పుష్ప‌.. సాయిప‌ల్ల‌వికి రెండు అవార్డులు

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News