Friday, March 29, 2024
- Advertisment -
HomeNewsAPKodali Nani | ఎన్టీఆర్ ఆస్తి మొత్తం నీకే ఇచ్చాడా? చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఏపీ మాజీ...

Kodali Nani | ఎన్టీఆర్ ఆస్తి మొత్తం నీకే ఇచ్చాడా? చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని

Kodali Nani | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌పై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విరుచుకుపడ్డారు. సీఎం జగన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యువగళం పేరిట చేస్తున్న పాదయాత్రలో జగన్‌పై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్‌ది రాయలసీమ అని.. లోకేశ్‌ డీఎన్‌ఏ మాత్రం తెలంగాణది ఆయన అన్నారు. తెలంగాణలో పుట్టి పెరిగి.. ఆంధ్రాకు వచ్చి ఏ ఎజెండా లేకుండా పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే లోకేశ్ పాదయాత్రను ఎవరూ విశ్వసించడం లేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

ఇక చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ ప్రాజెక్టులు నిండలేదని కొడాలి నాని గుర్తు చేశారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం జగన్ పండగలా చేశారని ప్రశసించారు. రెండు ఎకరాల నుంచి రెండు లక్షల ఎకరాల దాకా ఎలా సంపాదించాడో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ వారసులంతా సామాన్యుల్లా బతుకుతున్నారని.. ఎన్టీఆర్ తన ఆస్తి మొత్తం నీకే పంచి ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతులు మోసం చేసిన, పేదలను సర్వనాశనం చేసిన చంద్రబాబు 420 అని.. ఓ అవినీతి చక్రవర్తి అని విమర్శించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన సైకో చంద్రబాబు అంటూ మండిపడ్డారు.

నేను బూతులు మాట్లాడతాను అని అనే వాళ్లకు చంద్రబాబు, లోకేశ్ మాట్లాడే మాటలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. ‘సీఎం జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోం. తన అమ్మను ఏదో అవమానించారని లోకేశ్ అంటున్నారు. కానీ చంద్రబాబే తన భార్యను అల్లరి చేశారు. కావాలంటే అసెంబ్లీ రికార్డును పరిశీలించేందుకు తాము సిద్ధం. లోకేష్ వాళ్ల అమ్మ మాత్రమే ఆడదా.. భారతి కాదా. చంద్రబాబు, లోకేశ్‌కు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రావాలి. నా నియోజకవర్గానికి రా… నువ్వో నేనో తేల్చుకుందాం. నన్ను లేదా వంశీనో టచ్ చేసి చూడు మీ సంగతి చూస్తాం. నేను దేనికైనా సిద్దం’ అంటూ కొడాలి నాని సవాల్ విసిరారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News