Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsSrikar Bharat | ఇది శ్రీకారం మాత్రమే.. అరంగేట్రంపై శ్రీకర్‌ భరత్‌ వ్యాఖ్య

Srikar Bharat | ఇది శ్రీకారం మాత్రమే.. అరంగేట్రంపై శ్రీకర్‌ భరత్‌ వ్యాఖ్య

Srikar Bharat | టైమ్‌ 2 న్యూస్‌, నాగ్‌పూర్‌: విజయం ఒక్క రోజులో లభించదని.. నిరంతరం కష్టపడుతుంటే ఏదో ఒకరోజు తప్పక ఫలితం దక్కుతుందని టీమిండియా ఆటగాడు కోన శ్రీకర్‌ భరత్‌ అన్నాడు. నాలుగేళ్లుగా భారత జట్టుతో కొనసాగుతున్నా.. తుది జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయిన ఈ ఆంధ్ర ఆటగాడు.. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. నాగ్‌పూర్‌ వేదికగా గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో బరిలోకి దిగిన భరత్‌.. ఓ స్టంపింగ్‌తో పాటు.. రివ్యూ విషయంలో తన అభిప్రాయంతో అభిమానుల మనసు చూరగొన్నాడు.

ధోనీ రివ్యూ సిస్టమ్‌గా ముద్రపడ్డ డీఆర్‌ఎస్‌లో తానేం తక్కువ కాదని తొలి మ్యాచ్‌తోనే భరత్‌ నిరూపించాడు. స్టార్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఆసీస్‌ ఆటగాడు హ్యాండ్స్‌కోంబ్‌ పదే పదే ప్యాడ్లు అడ్డు పెడుతుండగా.. ఓ బంతికి భారత ఆటగాళ్లంతా ఔట్‌ అంటూ బిగ్గరగా అప్పీల్‌ చేశారు. ఈ సమయంలో వికెట్ల వెనుక నుంచి బంతిని నశితంగా పరిశీలించిన భరత్‌ మాత్రం.. రివ్యూ తీసుకునేందుకు సిద్ధమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మను వారించాడు. దీంతో రోహిత్‌ వెనక్కి తగ్గాడు. అనంతరం రిప్లేలో బంతి వికెట్లను తాకదని తేలింది. భరత్‌ అంచనా నిజమైంది. దీంతో రోహిత్‌ భరత్‌ను అభినందించాడు. ఇక కష్ట కాలంలో క్రీజులో నిలదొక్కుకొని కొరకరాని కొయ్యగా మారుతున్న తరుణంలో చక్కటి స్టంపింగ్‌తో లబుషేన్‌ను ఔట్‌ చేసిన శ్రీకర్‌ భరత్‌.. అంతర్జాతీయ స్థాయిలో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు.

మ్యాచ్‌ ఆరంభానికి ముందు చతేశ్వర్‌ పుజారా నుంచి టెస్టు క్యాప్‌ అందుకున్న భరత్‌.. 14వ నంబర్‌ జెర్సీతో బరిలోకి దిగాడు. తల్లి ఆశిస్సులు అందుకొని భరత్‌ గ్రౌండ్‌లో అడుగుపెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి మహమ్మద్‌ సిరాజ్‌ భారత జట్టులో కొనసాగుతుండగా.. ఇప్పుడు అతడికి భరత్‌ తోడయ్యాడు. ఆస్ట్రేలియాతో చివరిసారిగా జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో వీరోచితంగా పోరాడిన ఆంధ్ర రంజీ కెప్టెన్‌ హనుమ విహారికి ఈ సారి జట్టులో చోటు దక్కలేదు. అరంగేట్రం సందర్భంగా తన జర్నీని గుర్తు చేసుకున్న భరత్‌ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

ఇది నా ఒక్కడి కల కాదు..

జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందన్న భరత్‌.. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నాడు. ‘సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది. భారత్‌ తరఫున ఆడటం చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం నా ఒక్కడి కల మాత్రమే కాదు. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్‌ల అండతోనే ఈ స్థాయికి వచ్చా. నా జీవితంలో అద్భుతాలేమీ జరుగలేదు. రాకెట్‌ వేగంతో ఏమి మారలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడి వరకు వచ్చా. భారత్‌-‘ఏ’ తరఫున ఆడటం బాగా కలిసొచ్చింది. అక్కడ రాహుల్‌ ద్రవిడ్‌ సార్‌ను కలవడం నా జీవితాన్ని మార్చేసింది. ద్రవిడ్‌తో మాట్లాడిన ప్రతిసారి కొత్త విషయాలు నేర్చుకున్నా. వాటిని ఆచరణలో పెడుతూ ముందుకు సాగా. దీంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని భరత్‌ వెల్లడించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rohit Sharma | మాటల్లో కాదు చేతల్లో పోటీపడండి.. కంగరూలకు రోహిత్‌శర్మ చురక

Border Gavaskar Trophy | బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ.. ఆసీస్‌తో తొలి టెస్టులో అక్షర్‌ పటేల్‌కు షాకిచ్చిన రవిశాస్త్రి

Rahul Dravid on Border Gavaskar Trophy| టెస్టు క్రికెట్‌లో అదే ముఖ్యం.. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

Transgender Pregnant | పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అబ్బాయి.. సోషల్‌ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్న అతని భార్య

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News