Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsTransgender Pregnant | పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అబ్బాయి.. సోషల్‌ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్న...

Transgender Pregnant | పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అబ్బాయి.. సోషల్‌ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్న అతని భార్య

Transgender Pregnant | ఇండియాలో మొట్టమొదటి సారిగా ఓ ట్రాన్స్‌జెండర్ జంట తల్లిదండ్రులు అయ్యారు. అబ్బాయిగా మారిన జహాద్‌ పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. కేరళలోని కోజికొడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్‌ ద్వారా అతనికి ప్రసవం జరిగింది. ఈ విషయాన్ని జహాద్‌ భార్య జియా పావల్‌ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ తన సంతోషాన్ని పంచుకుంది. జహాద్‌ గర్భం ధరించిన విషయాన్ని కొద్దిరోజుల క్రితం ఈ ట్రాన్స్‌జెండర్‌ కపుల్‌ సోషల్‌మీడియాలో పంచుకుంది. అమ్మ కావాలనే తన కల.. నాన్న కావాలనే జహాద్ కోరిక త్వరలోనే నెరవేరబోతున్నాయంటూ జియా పావెల్ వెల్లడించింది.

గత మూడేళ్లుగా జహాద్, జియా పావల్ సహజీవనం చేస్తున్నారు. జియా పావెల్ పుట్టుకతో పురుషుడు.. లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా స్త్రీగా మారాడు. జహాద్ మహిళ.. కానీ పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గర్భాశయం సహా కొన్ని అవయవాలను ఇంకా తొలగించలేదు. ఇద్దరూ హార్మోన్ థెరపీ తీసుకుంటున్నారు. అయితే మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ తొలుత ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని భావించారు. అది కష్టమని తెలియడంతో తామే ఓ బిడ్డను కనడానికి ఏదైనా అవకాశం ఉందా? అని తెలుసుకున్నారు.
గర్భం ధరించేందుకు శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు లేవని కోజికోడ్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుల బృందం వెల్లడించడంతో జహాద్ బిడ్డకు జన్మనివ్వటానికి సిద్ధమయ్యాడు. దీనికోసం పురుషుడిగా మారే చికిత్సను జహాద్ వాయిదా వేసుకున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో అన్ని పరీక్షలు చేయించుకుని గర్భం దాల్చాడు. తాజాగా కేరళలోని కోజికోడ్‌ ఆస్పత్రిలో సిజేరియన్‌ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. ఈ విషయాన్ని అమ్మాయిలా మారిన 23 ఏళ్ల జియా పావెల్‌ ఇన్‌ స్టా వేదికగా వెల్లడించింది. బిడ్డ 2.92 కేజీలతో జన్మించిందని పేర్కొంది. మీ అందరి ఆశీర్వాదాలతో తండ్రీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది. అయితే బిడ్డ జెండర్‌ను మాత్రం గోప్యంగా ఉంచింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Border Gavaskar Trophy | బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ.. ఆసీస్‌తో తొలి టెస్టులో అక్షర్‌ పటేల్‌కు షాకిచ్చిన రవిశాస్త్రి

RBI Repo Rate | సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు

Gautam Adani | అదానీ ఒక్కడి కోసం రూల్స్ మార్చేశారు.. రాజ్యసభలో మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

PM Kisan | రైతులకు కేంద్రం మొండిచేయి.. పీఎం కిసాన్ డబ్బులపై కీలక ప్రకటన

JEE Main 2023 Results| జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేశాయి.. ఇలా చెక్ చేసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News