Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsDC vs RCB | ఢిల్లీ ధమాకా.. డబ్ల్యూపీఎల్‌లో నాలుగో విజయం.. ఐదో మ్యాచ్‌లోనూ బెంగళూరుకు...

DC vs RCB | ఢిల్లీ ధమాకా.. డబ్ల్యూపీఎల్‌లో నాలుగో విజయం.. ఐదో మ్యాచ్‌లోనూ బెంగళూరుకు తప్పని పరాజయం

DC vs RCB | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ( డబ్ల్యూపీఎల్‌ )లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జైత్రయాత్ర కొనసాగుతున్నది. తొలి సీజన్‌లో ఇప్పటికే మూడు విజయాలు ఖాతాలో వేసుకున్న ఢిల్లీ.. సోమవారం జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)పై గెలుపొందింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఎలీసా పెర్రీ (52 బంతుల్లో 67 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో రాణించగా.. రిచా ఘోష్‌ (16 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన కెప్టెన్‌ స్మృతి మంధన (8) విఫలం కాగా.. సోఫియా డివైన్‌ (21), హీతర్‌ నైట్‌ (11) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో శిఖ పాండే మూడు వికెట్లు ఖాతాలో వేసుకుంది. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసింది. కాప్సీ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్‌ (28 బంతుల్లో 32; 3 ఫోర్లు), మరినె కాప్‌ (32 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), జెస్‌ జాన్సన్‌ (15 బంతుల్లో 29 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించారు. బెంగళూరు బౌలర్లలో శోభన 2 వికెట్లు పడగొట్టింది.

ఇక కష్టమే..

ఐపీఎల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరహాలోనే.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లోనూ ఆర్సీబీ రాత మారడం లేదు. విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌ గేల్‌, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ వంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నా.. బెంగళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ చేజిక్కించుకోలేకపోయింది. మహిళల క్రికెట్‌ను కొత్త దశకు తీసుకెళ్లేందుకు బీసీసీఐ తొలిసారి ప్రవేశ పెట్టిన డబ్ల్యూపీఎల్‌లోనూ బెంగళూరు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధన ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. సోఫియా డివైన్‌, ఎలీసా పెర్రీ, హీతర్‌ నైట్‌, రిచా ఘోష్‌, రేణుకా సింగ్‌ వంటి అంతర్జాతీయ స్టార్‌లు అందుబాటులో ఉన్నా.. బెంగళూరుకు ఏదీ కలిసి రావడంలేదు. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఓడిన బెంగళూరు.. తాజా పరాజయంతో అనధికారికంగా ప్లే ఆఫ్‌ రేసు నుంచి తప్పుకుంది. మరోవైపు ఢిల్లీ నాలుగో విజయంతో ఎనిమిది పాయింట్లు ఖాతాలో వేసుకుంది.

Read More ;

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News