Signature Bank | అగ్ర రాజ్యం అమెరికాలో మరో బ్యాంకు మూతపడింది. కొద్ది రోజుల క్రితం మూతపడిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభాన్ని మరువకముందే సిగ్నేచర్ బ్యాంకును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఇది అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలోనే మూడో అతిపెద్ద బ్యాంకింగ్ వైఫల్యం. ఇటీవల కేవలం రెండు రోజుల వ్యవధిలోనే సిలికాన్ వ్యాలీ బ్యాంకు ( ఎస్వీఎం ) మూతపడగా.. 2008లో వాషింగ్టన్ మ్యూచువల్ పతనమయ్యాయి.
ఇక తాజాగా మూతబడిన సిగ్నేచర్ బ్యాంకుకు క్రిప్టో పరిశ్రమతోనే ఎక్కువ సంబంధాలున్నట్లు నియంత్రణ సంస్థల అధికారులు వెల్లడించారు. కేవలం 2 రోజుల వ్యవధిలో ఇలా రెండు పెద్ద బ్యాంకులు మూతపడటం అగ్రరాజ్యం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకింగ్ సెక్టార్లో ప్రకంపనలకు కారణమవుతోంది. ఇప్పటికే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలాతో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ షేర్లు పతనమవుతున్నాయి. ఇప్పుడు సిగ్నేచర్ బ్యాంక్ మూసివేత ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి.
అమెరికాలో వరుసగా బ్యాంకులు మూతపడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక ప్రసంగం చేశారు. బ్యాంకు వైఫల్యానికి కారణమైన వారిని జవాబుదారులుగా ఉంచుతామని ఆయన ప్రకటించారు. డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని అమెరికన్లకు బైడెన్ భరోసా ఇచ్చారు. పెద్ద బ్యాంకుల పర్యవేక్షణ, నియంత్రణను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.
అమెరికన్ ప్రజలు వ్యాపారాలకు అవసరమైనప్పుడు తమ బ్యాంకు డిపాజిట్లు తీసుకొవచ్చనే విశ్వాసాన్ని బైడెన్ కలిగించారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ వైఫల్యాల తర్వాత అమెరికన్లకు భరోసా ఇవ్వడానికి సోమవారం జాతినుద్దేశించి బైడెన్ ప్రసగించనున్నారు. అమెరికా ట్రెజరీతో సహా ఫైనాన్షియల్ ఏజెన్సీలు, ఎస్వీబీ డిపాజిటర్లు మార్చి 13 నుంచి వారి సొమ్మును తీసుకునేందకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. డిపాజిటర్ల అవసరాలను తీర్చేందుకు బ్యాంకులకు అదనపు నిధులను అందుబాటులో ఉంచుతామని ఫెడ్ ప్రకటించింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?
Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..
Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు
Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది