Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsAPVarahi Registration | పవన్ కళ్యాణ్ వారాహి వివాదానికి ఫుల్ స్టాప్.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ కంప్లీట్

Varahi Registration | పవన్ కళ్యాణ్ వారాహి వివాదానికి ఫుల్ స్టాప్.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ కంప్లీట్

Varahi Registration | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( pawan kalyan ) వారాహి ప్రచార రథానికి లైన్ క్లియర్ అయ్యింది. ఆర్టీఐ నిబంధనలకు అనుగుణంగానే వారాహి ఉందని తెలంగాణ ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. అనుమతులు అన్నీ ఉండటంతో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసినట్టు తెలిపారు. వారాహి వాహనానికి TS 13 EX 8384 నంబర్ కేటాయించినట్టుగా పేర్కొన్నారు. వారాహి రంగు గురించి మొదట్నుంచి మొదట్నుంచి వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా ఆర్టీఏ అధికారులు స్పందించారు. అది ఆర్మీ వాహనాలకు ఉపయోగించే ఆలివ్ గ్రీన్ కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని స్పష్టం చేశారు.

ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధమని డిసెంబర్ 7న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసినప్పటి నుంచి దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. ఆర్మీ వాహనాలకు మాత్రమే వాడే నిషేధిత ఆలివ్ గ్రీన్‌ను ప్రైవేటు వాహనాలకు ఎలా వినియోగిస్తారని చాలామంది ప్రశ్నించారు. రాజకీయ వర్గాల్లో కూడా ఇది పెద్ద చర్చకే దారి తీసింది. అసలు వారాహికి రిజిస్ట్రేషన్ అవుతుందా? లేదా? అనే అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేశారు. దీనికి తగ్గట్టుగానే వారాహి రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ అధికారులు నిరాకరించినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తెలంగాణ ఆర్టీఏ అధికారులు వారాహి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసింది. ఇప్పటికైనా వారాహి మొదలైన వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి. ఈ వాహనానికి తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించననున్నట్టు తెలుస్తోంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Ramcharan – Upasana | మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్

Ustaad Bhagat Singh | పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు మారిన టైటిల్.. ఉస్తాద్‌గా పవర్ స్టార్

Anupama Parameswaran | అందం, అభినయం రెండూ ఉన్నా అనుపమ పరమేశ్వరన్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎందుకు కాలేకపోయింది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News