Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsYadagiri Gutta Brahmotsvalu | రేపట్నుంచే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏం చేస్తారంటే..

Yadagiri Gutta Brahmotsvalu | రేపట్నుంచే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏం చేస్తారంటే..

Yadagiri Gutta Brahmotsvalu | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనునట్లు ఆలయ ఈవో ప్రకటించారు. మంగళవారం ఉదయం 10 గంతటలకు విశ్వక్సేన ఆరాధానతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని తెలిపారు. అనంతరం స్వస్తివాచనం, రక్షాబంధనం నిర్వహిస్తారని.. సాయంత్రం మృత్యంగ్రహణం, అంకురారోహనతో మొదటి రోజు క్రతువు ముగుస్తుందని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసినట్లు పేర్కొన్నారు.

బ్రహ్మోత్సవాల వివరాలు

  • 21-02-2023 ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం
  • 22-02-2023 ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ట, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీ పూజ, దేవత, ఆహ్వానసంహవనం
  • 23-02-2023 ఉదయం 8 గంటలకు అలంకార వాహన సేవలకు శ్రీకారం, ఉదయం 9 గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేద పారాయణం, రాత్రి 7 గంటలకు శేషవాహన సేవ
  • 24-02-2023 ఉదయం 9 గంటలకు వటపత్రసాయి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ
  • 25-02-2023 ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ, రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ
  • 26-02-2023 ఉదయం 9 గంటలకు గోవర్దనగిరిధారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహవాహన అలంకార సేవ
  • 27-02-2023 ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం
  • 28-02-2023 ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార ( హనుమంత వాహనం ) సేవ, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం
  • 01-03-2023 ఉదయం 9 గంటలకు గరుడ వాహన సేవ, రాత్రి 7 గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం
  • 02-03-2023 ఉదయం 10.30 గంటలకు మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు శ్రీపుష్పయోగం, దేవతోద్వాసన
  • 03-03-2023 ఉదయం 10 గంటలకు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సవం

    Follow Us :  Google News, FacebookTwitter

    Read More Articles:

    Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

    NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

    Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

    Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

    Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

    RELATED ARTICLES

    Youtube Latest Videos

    Time2News ను మీరు ఫాలో అవండి

    Google News
    28FansLike
    17FollowersFollow
    13FollowersFollow
    552SubscribersSubscribe

    Recent News