Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsViral News | ఈగలు తెచ్చిన తంటా.. ఆ ఊరి పేరు చెబితేనే పిల్లను ఇవ్వట్లేదు

Viral News | ఈగలు తెచ్చిన తంటా.. ఆ ఊరి పేరు చెబితేనే పిల్లను ఇవ్వట్లేదు

Viral News | అదో వింత సమస్య ! ఆ ఊరి పేరు చెబితే ఎవరూ పిల్లను ఇవ్వట్లేదు. పొరపాటున ఎవరైనా పెళ్లి చేసుకుని వచ్చినా సరే ఎక్కువ రోజులు ఉండట్లేదు. కాపురానికి వచ్చిన కొత్త కోడళ్లు పుట్టింటికి వెళ్లిపోతున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటో తెలుసా ! ఈగల మోత ! అక్కడ ఎటు చూసినా ఈగలే. కూర్చున్నా.. నిల్చున్నా.. పడుకున్నా.. ఏం చేసినా ఈగలు మొత్తం ముసిరిపోతున్నాయి. అందుకే ఈ ఊరు అంటేనే ఆడపిల్లలు భయపడిపోతున్నారు. దీంతో ఆ ఊళ్లో మగాళ్లంతా బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ జిల్లా హర్దోయ్ జిల్లా అహిరోరి బ్లాక్‌ సమీపంలో 2014లో పౌల్ట్రీ ఫారమ్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ బ్లాక్ సమీపంలోని బధియాన్ పూర్వా గ్రామంలో ఈగలు ఎక్కువయ్యాయి. గత మూడేళ్లుగా కాలుష్యం పెరగడంతో ఈగల బెడద మరింత ఎక్కువైంది. ఎటు చూసినా ఈగలే. నిద్రపోతున్నా.. భోజనం చేస్తున్నా.. ఏ పని చేస్తూ ఉన్న ఈగలు వచ్చి ముసురుకుంటున్నాయి. ఈగల రోదతో ఆయా గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.వీటి బాధలేక ఆ ఊరికి వచ్చిన కొత్త కోడళ్లు తమ పుట్టింటికి వెళ్లిపోతున్నారు.ఈ ఒక్క ఏడాదిలోనే బధియాన్ పుర్వా గ్రామానికి వచ్చిన ఆరుగురు కొత్త కోడళ్లు పుట్టింటికి వెళ్లిపోయారు. వాళ్ల భర్తలు వెళ్లి ఇంటికి రమ్మని ఎంత బతిమిలాడినా రావడం లేదు.వాళ్లు కాపురానికి రావాలంటే ఆ ఊరును అయినా వదిలేయాలని లేదా తమనైనా మరిచిపోవాలని కండీషన్ పెడుతున్నారు. అంటే ఆ గ్రామంలో ఈగల బెడద ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోండి.ఇక ఈ గ్రామాల్లోని సమస్య తెలిసిన వాళ్లు.. ఇక్కడి అబ్బాయిలకు పిల్లను కూడా ఇవ్వట్లేదు. దీంతో బ్రహ్మచారులు కూడా పెరిగిపోతున్నారు. ఈ ఒక్క ఊరే కాదు అహిరోరి బ్లాక్‌లో ఉన్న 10 గ్రామాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది.

‘ మా గ్రామంలో ఈగల సమస్య ఎక్కువైపోయింది. గత ఏడాది ఈ ఊరికి చెందిన ముగ్గురు అబ్బాయిలు, నలుగు అమ్మాయిలకు పెళ్లిళ్లు అయ్యాయి. ఈ ఊరికి వచ్చిన ముగ్గురు కొత్త కోడళ్లు కూడా పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. అంతేకాదు ఈ ఊరి నుంచి పెళ్లి చేసుకుని వెళ్లిన ఆడబిడ్డలను కూడా పుట్టింటికి రావడానికి తమ భర్తలు అడ్డుకుంటున్నారు.’ అని తమ సమస్యను ఆ గ్రామ సర్పంచ్ వికాస్ కుమార్ వివరించారు. ఇక ఈ ఏడాది అయితే తమ గ్రామంలో ఒక్క పెళ్లి కూడా జరగలేదని చెప్పుకొచ్చాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Bandi Sanjay | బీజేపీతో కలిసి రండి.. ప్రగతి భవన్ బద్దలు కొడదాం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బండి సంజయ్ పిలుపు

YS Sharmila Health Update | వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. అపోలో ఆస్పత్రికి తరలింపు

YS Sharmila | కేసీఆర్‌ సర్కార్‌ అణిచివేస్తున్నా వెనక్కి తగ్గని వైఎస్‌ షర్మిల.. వీరిద్దరి వ్యహహారంతో ప్రతిపక్షాలపై ఎఫెక్ట్‌!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News