Wednesday, May 22, 2024
- Advertisment -
HomeLatest NewsTSPSC Notification | 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్

TSPSC Notification | 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్

TSPSC Notification | తెలంగాణలోని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లోని 18 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఈ నెల 16 నుంచి 2023 జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రకటించింది.

ఈ 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్లో 5 పోస్టులు మల్టీ జోన్ 1లో, 13 పోస్టులు మల్టీ జోన్ 2లో ఉన్నాయి.అభ్యర్థులు 2022 జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 44 ఏళ్లలోపు ఉండాలి.ఈ పోస్టులకు జూన్‌లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. అర్హతలు, ఖాళీలు, ఇతరత్రా వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.

ఎస్సై, కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
ఎస్సీ, కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్రంలోని 12 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. సిద్దిపేట తప్ప అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో కేవలం 60 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News