Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsHyderabad Express Metro | శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసిన కేసీఆర్

Hyderabad Express Metro | శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసిన కేసీఆర్

Hyderabad Express Metro | విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మరో కీలక ఘట్టానికి చేరుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోలు – రాయదుర్గం కారిడార్‌కు కొనసాగింపుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే ఈ మార్గానికి మైండ్ స్పేస్ వద్ద భూమి పూజ చేశారు. అనంతరం పునాదిరాయి వేశారు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. రూ.6520 కోట్లతో నిర్మిస్తున్న ఈ మార్గాన్ని మూడేండ్లలో పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.

కొత్త మార్గమిదీ..

మెట్రో రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్లలో ఈ కొత్త మార్గాన్ని నిర్మించనున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 8 నుంచి 9 స్టేషన్లు ఉంటాయి. మైండ్ స్పేస్ కూడలి నుంచి 0.9 కిలోమీటర్ల దూరంలోని రాయిదుర్గం ఎయిర్‌పోర్టు స్టేషన్‌తో ఈ మెట్రో లైన్ ప్రారంభం అవుతుంది. ఆ స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ, కాజాగూడ చెరువు పక్క నుంచి నానక్‌రాంగూడ కూడలి, నార్సింగి ( ఓఆర్ఆర్ ), అప్పా కూడాలి, రాజేంద్రనగర్, శంషాబాద్ విమానశ్రయ కార్గో మీదుగా ఎయిర్‌పోర్టులోకి చేరుకుంటుంది.దాదాపు 31 కిలోమీటర్లలో ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు.ఈ లైన్ పూర్తయితే రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టుకు కేవలం 26 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Hyderabad Metro | మాకూ మెట్రో కావాలి.. హైదరాబాద్‌ ప్రజలు కొత్త డిమాండ్లు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News