Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLatest NewsHyderabad Metro | మాకూ మెట్రో కావాలి.. హైదరాబాద్‌ ప్రజలు కొత్త డిమాండ్లు

Hyderabad Metro | మాకూ మెట్రో కావాలి.. హైదరాబాద్‌ ప్రజలు కొత్త డిమాండ్లు

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో మరో కీలక ఘట్టానికి చేరుకుంది. రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మించబోతున్నారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.ఈ క్రమంలో నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తమకు మెట్రో కావాలని డిమాండ్లు చేస్తున్నారు. తమ రూట్‌లో మెట్రో నిర్మాణం జరిపి ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడేయాలని కోరుకుంటున్నారు.

నగర ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లు ఇవీ..

➢ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్నందున ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను పొడిగించాలని ఎప్పట్నుంచో డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. ఈ డిమాండ్‌కు మంత్రి కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. వచ్చే ఎన్నికల తర్వాత ఈ రూట్‌లో మెట్రో నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.

➢ ఖాజాగూడ నుంచి వెళ్లే మెట్రోను మణికొండ మీదుగా వేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

➢ రెండో దశ మెట్రోను శంషాబాద్ వరకే పరిమితం చేయకుండా అక్కడి నుంచి ఆదిభట్ల వరకు పొడిగించాలని డిమాండ్ ఉంది. దీనికోసం ఆదిభట్ల మెట్రో రైలు సాధన పోరాట సమితి కూడా ఏర్పాటైంది. తమ డిమాండ్‌లో భాగంగా తొలుత ఆదిభట్లకు మెట్రోను విస్తరించి.. తర్వాత రామోజీ ఫిలింసిటీ వరకు మెట్రో వేయాలని కోరుతున్నారు.

➢ పాతబస్తీలో ఎంజీబీఎస్ వరకు ఆగిపోయిన మెట్రో మార్గాన్ని ఫలక్‌నుమా వరకు విస్తరించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ణప్తి చేస్తారు.

మాస్టర్ ప్లాన్ ఇదీ..

➢ బీహెచ్‌ఈఎల్ నుంచి పటాన్‌చెరు వరకు 9.9 కిలోమీటర్ల మార్గం
➢ ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 9.1 కిలోమీటర్ల మార్గం
➢ ఫలక్‌నుమా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 16.6 కిలోమీటర్ల మార్గం
➢ ఎంజీబీఎస్ నుంచి ఘట్‌కేసర్ వరకు 23.2 కిలోమీటర్ల మార్గం
➢ జేబీఎస్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ వరకు 9.6 కిలోమీటర్ల మార్గం
➢ బోయిన్‌పల్లి నుంచి మేడ్చల్ వరకు 19.2 కిలోమీటర్ల మార్గం
➢ ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిలింసిటీ వరకు 15.9 కిలోమీటర్ల మార్గం
➢ బీహెచ్‌ఈఎల్ నుంచి దమ్మాయిగూడ వరకు 37.2 కిలోమీటర్ల మార్గం
➢ తార్నాక నుంచి కీసర ఓఆర్ఆర్ వరకు 19.6 కిలోమీటర్ల మార్గం
➢ చాంద్రాయణగుట్ట నుంచి రేతిబౌలి వరకు 16.1 కిలోమీటర్ల మార్గం
➢ నానక్‌రాంగూడ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 13.7 కిలోమీటర్ల మార్గం

Follow Us : FacebookTwitter

Read More Articles |

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News