Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsNew Year Traffic Diversions | న్యూఇయర్ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో...

New Year Traffic Diversions | న్యూఇయర్ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లేవాళ్లు జాగ్రత్త పడండి

New Year Traffic Diversions | న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 31న ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

ఇవీ దారి మళ్లింపులు

➢ ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్ మీదుగా ఎలాంటి వాహనాలను పర్మిషన్ ఉండదు.

➢ ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్, రాజ్‌భవన్ మీదుగా డైవర్ట్ చేస్తారు.

➢ లిబర్టీ కూడలి, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం వద్ద దారి మళ్లిస్తారు.

➢ నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి మీదుగా సంజీవయ్య పార్కు వైపు వెళ్లే వాహనాలను రాణిగంజ్ నుంచి దారి మళ్లిస్తారు.

➢ సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ కూడలి, లోయర్ ట్యాంక్‌బండ్ కట్ట మైసమ్మ ఆలయం మీదుగా మళ్లించనున్నారు.

ఔటర్‌పైనా ఆంక్షలు

ఓఆర్‌ఆర్‌పై రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాలకు అనుమతి లేదు. కేవలం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వాహనాలనే అనుమతిస్తారు. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పై కూడా ఇవే నిబంధనలు అమల్లో ఉంటాయి.

ఫ్లైఓవర్లు బంద్

గచ్చిబౌలి శిల్పాలేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సైబర్ టవర్ ఫ్లైఓవర్, షేక్‌పేట ఫ్లైఓవర్, మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నంబర్ 45 ఫ్లైఓవర్, ఫోరంమాల్ ఫ్లైఓవర్, జేఎన్‌టీయూ ఫ్లైఓవర్, కైత్లాపూర్ ఫ్లైఓవర్, బాలానగర్ జగ్జీవన్‌రామ్ ఫ్లైఓవర్లపైకి వాహనాలను అనుమతించరు.

తాగి వాహనాలు నడిపితే 6 నెలల జైలు

సైబరాబాద్ పరిధిలోని అన్ని మార్గాల్లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వాహనదారులు వెహికిల్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులకు చూపించి సహకరించాలని కోరారు. ఎవరైనా నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10వేల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తామని పేర్కొన్నారు.

రైడ్ క్యాన్సిల్ చేస్తే ఫిర్యాదు చేయండి

ట్యాక్సీలు, క్యాబ్‌ డ్రైవర్లు యూపిఫాం వేసుకోవడంతో పాటు వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. ప్రజల వద్ద డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. యాప్‌లో బుక్ చేసుకున్న రైడ్‌ను క్యాన్సల్ చేసే డ్రైవర్లపై 9490617346 నంబర్‌పై ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Prabhas | కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను ఇరుకున పెట్టిన బాలయ్య.. రెబల్ స్టార్ మనసులో మాట బయటపెట్టాడా?

Heeraben modi | ప్రధాని మోదీకి మాతృ వియోగం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

US Air Force | అమెరికా విమానంపై దాడి చేయబోయిన చైనా యుద్ధ విమానం.. పైలట్ చాకచక్యంతో జస్ట్ మిస్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News