Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsSSC Exams | పదో తరగతి పేపర్ లీక్.. రేపటి పరీక్షపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ...

SSC Exams | పదో తరగతి పేపర్ లీక్.. రేపటి పరీక్షపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

SSC Exams | టీఎస్పీఎస్సీ వివాదం తర్వాత మరో ప్రశ్నపత్రం లీకేజీ తెలంగాణలో కలకలం రేపింది. సోమవారం ఉదయం పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన ఏడు నిమిషాల్లోనే క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చింది. వాట్సాప్‌ గ్రూప్‌లో తెలుగు పేపర్ చక్కర్లు కొడుతున్నట్లు మండల విద్యాధికారి (ఎంఈవో) గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకొచ్చింది. పేపర్ లీకైనట్లు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు మొదలుపెట్టారు. అత్యంత వేగంగా విచారణ జరిపి తాండూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న బయో సైన్స్ ఉపాధ్యాయుడే పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. పేపర్ లీకేజీపై పలు రకాల కథనాలు వస్తుండటంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.

అసలేం జరిగిందో కలెక్టర్ మాటల్లోనే..

తాండూరులోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఉదయం 9:30 గంటలకు పదో తరగతి తెలుగు పరీక్ష మొదలైంది. అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న బయోసైన్స్ ఉపాధ్యాయుడు బందెప్ప 9:37 గంటలకు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాడు. ఆ వెంటనే మెసేజ్‌ను డిలీట్ చేసేశాడు. కానీ అప్పటికే గ్రూప్‌లో ఉన్న మిగతా సభ్యులు పేపర్‌ను తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇతరులకు షేర్ చేశారు. దీంతో వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి ప్రశ్నపత్రం వైరల్‌గా మారింది. ఇలా క్వశ్చన్ పేపర్ వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడం గమనించిన ఎంఈవో ఉదయం 11 గంటల సమయంలో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి బందెప్ప కారణంగానే పేపర్ లీకైనట్లు గుర్తించారు.

రేపటి పేపర్‌పై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ

పదో తరగతి తెలుగు పేపర్ లీకవ్వడంతో రేపు జరగాల్సిన పరీక్ష వాయిదా పడిందని సోషల్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అది నిజమా? వందతా అనేది తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రేపటి నుంచి అన్ని పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించింది. అలాగే.. పేపర్‌ను వాట్సాప్ ద్వారా బయటకు పంపించిన వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రశ్నపత్రం బయటకు పంపించిన బందెప్ప, ఇన్విజిలేటర్ సమ్మప్ప, చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్ ‌మెంటల్ ఆఫీసర్ గోపాల్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sunrisers Hyderabad | పరాజయంతో రైజర్స్‌ ప్రయాణం ప్రారంభం.. రాజస్థాన్‌ చేతిలో హైదరాబాద్‌ ఓటమి – Time2news.com

PV Sindhu | పీవీ సింధు రన్నరప్‌తో సరి.. స్పెయిన్‌ మాస్టర్స్‌ ఫైనల్లో పరాజయం

LSG vs DC | సొంతగడ్డపై లక్నో తొలి విజయం.. 50 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి

Costumes Krishna | కాస్ట్యూమ్స్‌ కృష్ణ తీసిన సినిమా సూపర్‌ హిట్టయినా ఇండస్ట్రీని ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చింది? ఆ స్టార్‌ హీరోను నమ్మడమే కారణమా?

Costumes Krishna | ఆయన వల్లే కాస్ట్యూమర్‌గా బిజీగా ఉన్న కృష్ణ.. నటుడిగా మారాల్సి వచ్చింది!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News