Home Latest News Congress strategy office seized | తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ స్ట్రాటజీ టీమ్‌ హెడ్‌ ఆఫీసుపై...

Congress strategy office seized | తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ స్ట్రాటజీ టీమ్‌ హెడ్‌ ఆఫీసుపై పోలీసుల దాడులు.. ఆఫీసు సీజ్‌

Congress strategy office seized | తెలంగాణలో కాంగ్రెస్‌ స్ట్రాటజీ టీమ్‌ ప్రధాన కార్యాలయంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దాడి చేశారు. ఆఫీసులోని కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ సీజ్‌ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్‌తో పాటు సోషల్‌ మీడియాలో వేదికగా సీఎం కేసీఆర్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీమ్స్‌ పెడుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గత కొంతకాలంగా నిఘా పెట్టారు. ఐపీ అడ్రస్‌ ఆధారంగా ఇనార్బిట్‌ మాల్‌ పక్కనే ఉన్న ఎస్‌కే టీమ్‌ ఆఫీసును కొన్నాళ్లుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ట్రాక్‌ చేస్తున్నారు. తాజాగా దాడులు చేసి ల్యాప్ టాప్‌, కంప్యూటర్‌ సీజ్‌ చేశారు. కార్యాలయంలోని సిబ్బంది సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్‌ చేపించి దర్యాప్తు చేపట్టారు.

గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్ హెడ్‌గా కనుగోలు సునీల్‌ (SK team ) పని చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించి ఆఫీసును సీజ్‌ చేశారు. అయితే.. స్ట్రాటజీ ఆఫీసుకు పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఎఫ్‌ఐఆర్‌ లేకుండా ఆఫీసు ఎలా సీజ్‌ చేస్తారంటూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

పోలీసుల అదుపులోకి షబ్బీర్‌ అలీ, మల్లురవి

సునీల్‌ కనుగోలు ఆఫీసు సిబ్బంది ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి అక్కడే ప్రశ్నిస్తున్నారు. కాగా, ఎస్‌కే ఆఫీసుపై పోలీసులు దాడి చేసిన విషయం తెలుసుకుని అక్కడి చేరుకున్న షబ్బీర్‌ అలీ, మల్లురవితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఎస్‌కే ఆఫీసును సీజ్‌ చేయడంపై రేవంత్ రెడ్డి సీరియస్‌

ఎస్‌కే ఆఫీసును సీజ్‌ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లోనే కాంగ్రెస్‌ వ్యవహారాలు జరుగుతాయని ఆయన అన్నారు. అలాంటి కార్యాలయంలో పోలీసుల పెత్తనమేంటని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే.. పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Amit shah comments on congress | చైనా నుంచి కాంగ్రెస్ సంస్థకు డబ్బులు అందాయి.. కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

Congress political crisis | కాంగ్రెస్ కు రోగమొచ్చింది.. దాన్ని నయం చేయాల్సిందే.. దామోదర రాజనర్సింహా సంచలన వ్యాఖ్యలు

India-China troops clash | భారత్-చైనా సరిహద్దులో ఘర్షణపై రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో కీలక ప్రకటన..

Sukhvinder Singh Sukhu | సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు తొలిసారిగా ఏం మాట్లాడారు? ఎవరిని టార్గెట్‌ చేశారు?

Exit mobile version