Saturday, April 27, 2024
- Advertisment -
HomeNewsInternationalBoris Johnson | మిస్సైల్‌తో దాడి చేసి చంపేస్తానని నన్ను పుతిన్‌ బెదిరించారు…బ్రిటన్‌ మాజీ ప్రధాని...

Boris Johnson | మిస్సైల్‌తో దాడి చేసి చంపేస్తానని నన్ను పుతిన్‌ బెదిరించారు…బ్రిటన్‌ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Boris Johnson | రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిస్సైల్‌తో దాడి చేసి చంపేస్తానని తనను పుతిన్ బెదిరించాడని ఆయన ఆరోపించారు. ఉక్రెయిన్ ఆక్రమణకు ముందు అంటే ఫిబ్రవరి 24న ఈ సంఘటన చోటు చేసుకుంది. పుతిన్ వర్సెస్ వెస్ట్ పేరిట రష్యా అధ్యక్షుడిపై బీబీసీ ఓ డాక్యుమెంటరీ నిర్మించింది. మూడు భాగాలు తీసిన ఈ డాక్యుమెంటరీలో ఈ విషయాలు బోరిస్ జాన్సన్ వెల్లడించారు.

యుద్ధానికి ముందు రష్యా అధ్యక్షుడు తనకు ఫోన్ చేశాడని.. ఆ కాల్‌లోనే ఆయన బెదిరించాడని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. బోరిస్.. నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. కానీ మిస్సైల్‌తో దాడి చేసి చంపేందుకు నిమిషం చాలు అంటూ హెచ్చరించాడని బోరిస్ వెల్లడించారు. పుతిన్ బెదిరింపులకు తాను భయపడలేదని ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చేందుకు యత్నించానని తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడిని ఆపేందుకు జాన్సన్‌ తో పాటు పలు దేశాల నాయకులు రాజధాని కీవ్‌ కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.

యుద్దం ప్రారంభం కాకముందే నుంచే బోరిస్‌ ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్నారు. ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం తీసుకునే అవకాశం తక్షణమే లేదని తాను పుతిన్‌తో పేర్కొన్నారు. దాడి ఏదైనా రష్యా సరిహద్దుల్లో అధికంగా జరుగుతోందని, ఇది నాటో చర్యలకు దారి తీస్తుందని కూడా పుతిన్‌ తో చెప్పినట్లు వివరించారు. కానీ ఈ విషయం చెప్పేటప్పుడు నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నానని పేర్కొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News