Home Latest News Siddipet | సిద్దిపేట అడిషనల్‌ కలెక్టర్‌పై వీధికుక్క దాడి.. వాకింగ్‌ చేస్తుండగా పిక్కపట్టి కొరికేసిన శునకం

Siddipet | సిద్దిపేట అడిషనల్‌ కలెక్టర్‌పై వీధికుక్క దాడి.. వాకింగ్‌ చేస్తుండగా పిక్కపట్టి కొరికేసిన శునకం

Siddipet | సిద్దిపేటలో వీధికుక్కలు రెచ్చిపోతున్నాయి. రోడ్ల మీదనే కాదు కలెక్టరేట్‌ ప్రాంగణం, క్వార్టర్స్‌లో కూడా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకంగా క్వార్టర్స్‌ ప్రాంగణంలో వాకింగ్‌ చేస్తున్న జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డిని ఓ వీధి కుక్క తీవ్రంగా కరిచింది. రెండు పిక్కలను పట్టుకుని కండను లాగేసింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే రోజు అడిషనల్‌ కలెక్టర్‌తో పాటు క్వార్టర్స్‌లోని మరో వ్యక్తితో పాటు కలెక్టర్‌ పెంపుడు శునకంపై కూడా దాడి చేశాయి.

సిద్దిపేట శివారులోని కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉన్న క్వార్టర్స్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి ఉంటున్నారు. శనివారం రాత్రి భోజనం ముగించుకున్న తర్వాత క్వార్టర్స్‌ ప్రాంగణంలో వాకింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఓ వీధికుక్క ఆయనపై దాడి చేసింది. ఆయన్ను ఇష్టం వచ్చినట్లు కరిచింది. దీంతో రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఆయన్ను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అదే రోజు మరో వీధికుక్క క్వార్టర్స్‌లోని మరో వ్యక్తిని, కలెక్టర్‌ పెంపుడు శునకాన్ని కరిచింది.

Exit mobile version