Home News International Srilanka | బ్యాలెట్ పేపర్ ముద్రించేందుకు కూడా డబ్బులు లేక ఎన్నికలు వాయిదా.. అధ్వానంగా శ్రీలంక...

Srilanka | బ్యాలెట్ పేపర్ ముద్రించేందుకు కూడా డబ్బులు లేక ఎన్నికలు వాయిదా.. అధ్వానంగా శ్రీలంక పరిస్థితి

Srilanka | శ్రీలంక గత కొద్ది నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ప్రజలు కనీసం తినడానికి తిండి కూడా లేక అల్లాడిపోతున్నారు. నిత్యవసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. పైగా ప్రభుత్వ ఖజానా కూడా ఖాళీ అవ్వడంతో ఆ దేశంలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈ క్రమంలో శ్రీలంక ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

బ్యాలెట్ పేపర్ల ముద్రణకు, పోలింగ్ బూత్‌ల వద్ద భద్రత కల్పించేందుకు కావాల్సినన్ని నిధులు లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. అందుకే మార్చి 9న జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 3 తర్వాత కొత్త ఎన్నికల తేదీలను వెల్లడిస్తామని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద విదేశీ మారక నిల్వలు కేవలం 500 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. దీంతో శ్రీలంక ఆర్థికంగా తీవ్ర పరిస్థితి ఎదుర్కొంటుంది. దీంతో ఈ దేశానికి అప్పులు ఇవ్వకుండా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), పారిస్ క్లబ్ ఆంక్షలు విధించాయి.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఎక్కువగా చైనా నుంచే రుణాలను పొందింది. ప్రస్తుతం తీవ్ర సంక్షోభం ఉన్న నేపథ్యంలో రుణాల పుణర్వ్యవస్థీకరణలో భాగంగా ఆర్థిక 10 ఏళ్ల రుణ మారిటోరియంతో ఆర్థిక సాయం పొందేందుకు ఐఎంఎఫ్ ప్రతిపాదించింది. కానీ ఇందుకు చైనా ఒప్పుకునేలా కనిపించడం లేదు. శ్రీలంకకు ఈ వెసులుబాటు కల్పిస్తే చైనా నుంచి లోన్లు తీసుకున్న ఇతర మిత్ర దేశాలకు కూడా ఇలాంటి సాయమే అందించాల్సి వస్తుంది. ఆఫ్రికాలో బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్‌తో పాటు పాకిస్థాన్‌కు కూడా చైనా ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది. అందుకే పాక్‌కు 700 మిలియన్ డాలర్ల రుణాన్ని రీఫైనాన్స్ చేసింది తప్ప కొత్తగా రుణాలు ఇవ్వలేదు.

Exit mobile version