Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsHyderabad | అప్సర హత్యకు 4 నెలల నుంచే ప్లాన్.. 20 రోజుల ముందే గొయ్యి...

Hyderabad | అప్సర హత్యకు 4 నెలల నుంచే ప్లాన్.. 20 రోజుల ముందే గొయ్యి తవ్వా.. అసలు విషయాలు బయటపెట్టిన పూజారి

Hyderabad | వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను పూజారి హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది అనుకోకుండా ఆవేశంలో జరిగిన హత్య కాదని.. పకడ్బందీగా 4 నెలల నుంచే ప్లాన్ చేసి చంపేసినట్లు బయటపడింది. శుక్రవారం రాత్రి పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన సమయంలో అప్సరను చంపేందుకు ఎన్ని ప్లాన్‌లు వేశాడో పూజారి వెంకట సూర్య సాయి కృష్ణ బయటపెట్టాడు.

శంషాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్సరతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి వెంకట సూర్య సాయికృష్ణ.. మొదట్నుంచి ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఇటీవల పెళ్లి చేసుకోవాలనే వేధింపులు ఎక్కువ కావడంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం అప్సరను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులకు దొరక్కుండా ఎలా హత్య చేయాలనే దానిపై ఈ ఏడాది మార్చి నుంచే గూగుల్‌లో వెతికాడు. ఒక మనిషిని ఎలా చంపాలి? డెడ్ బాడీ ఆనవాళ్లు లేకుండా ఎలా చేయొచ్చనే వివరాలను సెర్చ్ చేశాడు. హత్యకు పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు.

కోయంబత్తూర్ తీసుకెళ్లాలని అప్సర కొద్దిరోజులుగా సాయికృష్ణను అడుగుతోంది. దీంతో ఫ్లైట్‌లో వెళ్దామని చెప్పి శంషాబాద్‌ తీసుకొచ్చి అక్కడి నిర్జన ప్రదేశంలో ఆమెను హత్య చేయాలని అనుకున్నాడు. తన ప్లాన్‌లో భాగంగా ఈ నెల 3న రాత్రి 8 గంటలకు సరూర్‌నగర్ నుంచి అప్సరను కారులో ఎక్కించుకుని శంషాబాద్ తీసుకొచ్చి చంపేశాడు. హత్య తర్వాత అప్సర్ డెడ్ బాడీని తను పూజలు చేసే గుడి దగ్గరే పాతిపెట్టాలని ముందు నుంచి అనుకున్నాడు. ఈ క్రమంలో హత్యకు 20 రోజుల ముందే ఒక గొయ్యి కూడా తవ్వించి పెట్టాడు. పోలీస్ జాగిలాలకు దొరక్కుండా తప్పించుకోవడానికి గోతిలో వేసేందుకు ఉప్పు కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ తీరా సమయానికి ఆ గోతిలో పూడ్చిపెట్టడం కుదరలేదు. దీంతో అప్సర డెడ్‌బాడీని ఒక మ్యాన్‌హోల్‌లో పడేశాడు. రెండు రోజుల తర్వాత అక్కడ వాసన వస్తుండటం గమనించిన సాయికృష్ణ ఈ నెల 7వ తేదీన రెండు ట్రక్కుల ఎర్రమట్టిని తెప్పించి మ్యాన్‌హోల్‌లో వేయించాడు. దానిపై కాంక్రీట్ వేసి పకడ్బందీగా క్లోజ్ చేయించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్‌.. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ కౌంటర్‌

Adipurush | ఆదిపురుష్ సినిమా చూసేందుకు వచ్చిన హనుమంతుడు.. జై శ్రీరామ్ అంటూ మార్మోగిన సినిమా హాల్

Weather Updates | బిపర్‌జాయ్ ఎఫెక్ట్.. తెలంగాణలో వర్షాలు బంద్.. జూన్ చివరిదాకా ఎండలే !

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News