Sunday, April 14, 2024
- Advertisment -
HomeLatest Newsviral news | పురుషుడిగా మారాక వదిలేసిన యువతి.. కావాలంటే మళ్లీ లేడీగా మారమని సూచన.....

viral news | పురుషుడిగా మారాక వదిలేసిన యువతి.. కావాలంటే మళ్లీ లేడీగా మారమని సూచన.. ఇద్దరమ్మాయిల ప్రేమ కథలో ట్విస్ట్

viral news | ఇద్దరూ అమ్మాయిలే కానీ వాళ్ల మనసులు కలిశాయి. జీవితాంతం ఒకరికొకరు తోడుగా కలిసి ఉండాలని అనుకున్నారు. సమాజం తప్పు అన్నా.. పెద్దలు ససేమిరా అన్నా లెక్కచేయలేదు. అందర్నీ ఎదురించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లు కలిసి ఉన్నారు. కానీ ఇద్దరు ఆడవాళ్లే అయితే కాపురం ఎలా చేసేది.. అందుకే నువ్వు మగాడిలా మారమని వారిలో ఓ అమ్మాయి సలహా ఇచ్చింది. తన ప్రియురాలి కోసం మరో అమ్మాయి.. లింగమార్పిడి చేసుకుని అబ్బాయిగా మారింది. తీరా మగాడిలా మారి ముందుకొస్తే నువ్వు నాకు వద్దు అంటూ పేచీ పెడుతోంది. నీతో కలిసి ఉండలేను.. కావాలంటే అమ్మాయిలా మారి నీ దారి నువ్వు చూసుకోమంటూ వెళ్లిపోయింది. ఈ వింత ఘటన యూపీలోని ఝాన్సీ జిల్లాలో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాకు చెందిన సనా ఖాన్‌, సోనాల్‌ శ్రీవాత్సవ అనే ఇద్దరమ్మాయిలు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి కాపురం కూడా పెట్టారు. అయితే ఇద్దరు అమ్మాయిలుగానే ఉంటే ఎలా.. మనమిద్దరం కలిసి ఉండాలంటే మనలో ఒకరు మగాడిలా ఉండాల్సిందేనని సనాఖాన్‌కు సోనాల్‌ చెప్పింది. సోనాల్‌తో జీవితాంతం కలిసి ఉండాలని సనా ఖాన్‌ లింగమార్పిడి ఆపరేషన్‌కు సిద్ధమైంది. రూ.6 లక్షలు ఖర్చు పెట్టి మరీ లింగమార్పిడి చేసుకుంది. తన పేరును సనా ఖాన్‌ బదులు సుహైల్‌ ఖాన్‌గా మార్చుకుంది.

ఇంతలో సోనాల్‌ శ్రీవాత్సవకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. అక్కడ డ్యూటీలో సోనాల్‌కు మరో అబ్బాయి పరిచయం అయ్యాడు. అతనితో సోనాల్‌ ప్రేమలో పడింది. అప్పట్నుంచి సనా ఖాన్‌ను సోనాల్‌ దూరం పెట్టడం మొదలుపెట్టింది. సోనాల్‌ ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన సనా.. ఇదేంటని ప్రశ్నిస్తే నువ్వు నాకొద్దు అని తెగేసి చెప్పేసింది. మరి నా పరిస్థితేంటి అని సనా అడిగితే.. అంతగా ఇబ్బంది ఉంటే మళ్లీ అమ్మాయిగా మారమని చెప్పి వెళ్లిపోయింది. సోనాల్‌ వదిలేయడంతో తాను మోసపోయానని సనా ఖాన్‌ కోర్టును ఆశ్రయించింది. గత ఏడాది జూన్‌ 3న కోర్టులో దావా వేసింది. దీనిపై ఫిబ్రవరి 23న విచారణ జరగనుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IB Recruitment 2023 | పదవ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ. 69 వేల వరకు జీతం!

Hanmakonda | లేడీస్‌ హాస్టల్‌లో అర్ధరాత్రి దొంగతనం చేసి బావిలో పడ్డ దొంగ.. తెల్లారి బయటకుతీస్తే అసలు విషయం తెలిసింది!

Preliminary key | పోలీసు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల.. మొత్తం 6,100 పోస్టులు!

Smith Sabharwal | తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి ఇంట్లోకి అర్థరాత్రి ప్రవేశించిన వ్యక్తి ఎవరు.. దాని గురించి ఆమె ఏమన్నారు!

Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News