Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (09-02-2023)

Horoscope Today | రాశిఫలాలు (09-02-2023)

Horoscope Today | మేషం

గృహాలంకరణకు ప్రాముఖ్యతనిస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధిక ధన వ్యయం చేస్తారు. శుభ కార్యాలకు సంబంధించి నిర్ణయాలు అమలు చేస్తారు. వాహన యోగం ఉంది.

వృషభం

నిష్ణాతుల నుంచి సలహాలను తీసుకుంటారు. విద్యా, వైద్య రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలకు తగిన అవకాశాలు కలిసి వస్తాయి. ఓర్పు కలిగి ఉంటారు.

మిథునం

వినోద కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఫాస్ట్‌ఫుడ్స్‌పై ఆసక్తి చూపుతారు. నూతన ఫైనాన్షియల్‌ స్కీమ్స్‌లో సభ్యత్వాన్ని తీసుకుంటారు. కొనుగోళ్లు చేస్తారు.

కర్కాటకం

మనసులోని భావాలను మిత్రవర్గంతో పంచుకుంటారు. భూ, గృహ సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. న్యాయపరమైన అంశాలపై నిష్ణాతులతో కలిసి సంప్రదింపులు సాగిస్తారు.

సింహం

సౌందర్య సాధక చిట్కాలను పాటిస్తారు. రహస్య వ్యూహాలను అమలు పరుస్తారు. వ్యాపార దక్షత కనబరుస్తారు. మనో ప్రశాంతత కలిగి ఉంటారు. రాజకీయ పరపతి పెంచుకుంటారు.

కన్య

ఉన్నత స్థాయి వారి నుంచి వాగ్దానాలు తీసుకుంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ ఆలోచనలు చురుగ్గా సాగుతాయి. సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. వాహన యోగం ఉంది.

తుల

వివాదాస్పదమైన అంశాలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ప్రకటనలు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు సమాయత్తం అవుతారు.

వృశ్చికం

కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాయబారాలు సాగిస్తారు. మీపై ఉన్న గుడ్‌విల్‌ రుజువు చేసుకోగలుగుతారు. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించడంలో సఫలమవుతారు.

ధనుస్సు

ఉన్నత విద్య అవకాశాలు కలిసివస్తాయి. సంతానాన్ని క్రమశిక్షణాయుతమైన బాటలో నడిపించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. ప్రయోజనం ఆశించి మీరు చేసే అన్ని పనుల్లో లబ్ధి చేకూరుతుంది.

మకరం

పంచాయితీలు లాభించవు. కుటుంబంలో ఇతరుల మితిమీరిన జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. చిన్నపాటి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కఠినమైన పనులను కూడా నిర్వహించగలుగుతారు.

కుంభం

నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు. ఇతర భాషల్లో ప్రావీణ్యత సాధించాలని నిర్ణయించుకుంటారు. వాహనాలు నడిపేటప్పుడు మెలకువలు అవసరం.

మీనం

పానీయాలు ఎక్కువగా సేవిస్తారు. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్న పని దొంగలను కట్టుదిట్టంగా పట్టుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News