Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentVijay Antony | నేను క్షేమంగానే ఉన్నా.. ఆస్పత్రి బెడ్‌పై నుంచే అప్‌డేట్ ఇచ్చిన బిచ్చగాడు...

Vijay Antony | నేను క్షేమంగానే ఉన్నా.. ఆస్పత్రి బెడ్‌పై నుంచే అప్‌డేట్ ఇచ్చిన బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ

Vijay Antony | మలేసియాలో పిచ్చైకారన్ 2 సినిమా షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ ఆంటోనీ పరిస్థితి ఎలా ఉంది? సోషల్ మీడియాలో ఏమో అతని పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తుంటాయి.. విజయ్ ఆంటోనీ సన్నిహితులేమో అతని పరిస్థితి బాగానే ఉందని చెబుతుంటారు. మరి అసలు నిజం ఏంటి? అసలు తమ హీరో ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందని తెలియక కంగారు పడుతున్న అభిమానులకు విజయ్ ఆంటోనీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ట్విట్టర్ ద్వారా స్పందించిన విజయ్ ఆంటోనీ.. తాను క్షేమంగానే ఉన్నానని స్పష్టంచేశాడు.

మలేసియాలో పిచ్చైకారన్ 2 (బిచ్చగాడు 2) చిత్ర షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యానని.. దవడ, ముక్కు భాగాల్లో తీవ్రగాయాలు అయ్యాయని విజయ్ ఆంటోనీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. వాటికి సంబంధించిన సర్జరీలు పూర్తయ్యాయని.. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని స్పష్టం చేశాడు. తొందరలోనే మీ అందరితో మాట్లాడతానని పేర్కొన్నాడు. తొందరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. దీంతో పాటు ఆస్పత్రి బెడ్‌పై ఉండి థంబ్సప్ సింబల్ చూపిస్తున్న ఫొటోను షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. విజయ్ ఆంటోనీ క్షేమంగానే ఉన్నాడని ఊపిరి పీల్చుకుంటున్నారు.

కోలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోనీ నాన్ ( నకిలీ ) సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. కానీ తర్వాత వచ్చిన పిచ్చైకారన్ ( బిచ్చగాడు ) సినిమాతో తెలుగువాళ్లకు దగ్గరయ్యాడు. అప్పట్నుంచి విజయ్ ఆంటోనీ నటించిన ప్రతి సినిమా తెలుగులో విడుదల అవుతుంది. విభిన్న కథాంశాలతో వస్తుండటంతో విజయ్ ఆంటోనీ సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ క్రమంలో 2016లో సూపర్ హిట్‌గా నిలిచిన పిచ్చైకారన్ సినిమాకు సీక్వెల్ తీస్తున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ సినిమాతో దర్శకుడిగా కూడా మారుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం మలేసియా వెళ్లిన విజయ్ ఆంటోనీ.. అక్కడే ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న బోటు అదుపుతప్పి.. చిత్ర సిబ్బంది ఉన్న బోటును ఢీకొట్టింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Naatu Naatu Song in Oscar list | ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ పాట.. ఎన్టీఆర్‌కు మాత్రం నిరాశే

NTR vs ANR | టాలీవుడ్‌లో సరికొత్త రచ్చ.. ఎన్టీఆర్, ఏయన్నార్ ఫ్యామిలీ మధ్య ముదురుతున్న వివాదం

Kl Rahul – Athiya Shetty | ఓ ఇంటివాడైన కేఎల్‌ రాహుల్‌.. ప్రియురాలు అతియా శెట్టితో ఏడడుగులు

Karthika Deepam | సిగ్గుపడుతున్నా అంటే నాకు పెళ్లికళ వచ్చేసినట్టే.. ట్విస్ట్‌ ఇచ్చిన కార్తీక దీపం మోనిత

Keerthy Suresh | విడాకులకు సిద్ధమైన కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్.. కీర్తి సురేశ్‌తో ప్రేమే కారణమా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News