Tuesday, June 18, 2024
- Advertisment -
HomeLatest NewsSmita Sabharwal | స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ సస్పెండ్.. కలెక్టర్...

Smita Sabharwal | స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ సస్పెండ్.. కలెక్టర్ ఉత్తర్వులు

Smita Sabharwal | ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన మేడ్చల్ జిల్లా డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. చంచల్ గూడ జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూ అధికారులు ఉత్తర్వుల కాపీనీ అందచేయనున్నారు.

అసలేం జరిగిందంటే..

రెండు రోజుల క్రితం రాత్రి డిప్యూటీ తహసీల్దార్‌ నేరుగా స్మితా సబర్వాల్ ఉండే నివాస సముదాయానికి వెళ్లాడు. తన స్నేహితుడైన ఓ హోటల్‌ యజమానిని తోడు తీసుకుని వెళ్లాడు. తాను ఫలానా క్వార్టర్‌ కు వెళ్లాలని సిబ్బందికి చెప్పడంతో వారు లోపలికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. ఫ్రెండ్‌ ని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్‌ మాత్రమే స్మిత సబర్వాల్ ఇంట్లోకి వెళ్లాడు. లోపలికి ప్రవేశించి గది తలుపు కొట్టాడు. డోర్‌ తెరిచిన స్మితాకి రాత్రి సమయంలో ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో తీవ్రంగా భయపడ్డారు.

వెంటనే ఆమె ఎవరని గట్టిగా నిలదీయడంతో. అతను నేను మీకు గతంలో ట్వీట్‌ చేశానని.. నా ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని సమాధానం చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె బయటికి వెళ్లాలని చెప్తూ గట్టిగా కేకలు వేసింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. డిప్యూటీ తహసీల్దార్‌ తో పాటు అతడి స్నేహితుడిని కూడా అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు.

ఈ విషయాన్ని స్మిత సబర్వాల్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. తన ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తిని చూడగానే చాలా భయపడ్డాను. ఆ రోజు రాత్రి తనకు ఎంతో బాధాకరమైన అనుభవం ఎదురైంది. అయితే తనను తాను రక్షించుకోవడం గురించి తాను దృష్టి పెట్టినట్లుగా ట్వీట్‌ చేశారు. మీరు సురక్షితంగా ఉన్నారని భావించినప్పటికీ ఎప్పుడూ కూడా తలుపులు, తాళాలు తనిఖీ చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నెంబర్‌ కు డయల్‌ చేయాలంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Yadagirigutta | కాళ్లు,చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి ముగ్గురు చిన్నారులను నడిరోడ్డుపై వదిలేసిన తల్లి.. ప్రియుడి మోజులో పడి దారుణం

IB Recruitment 2023 | పదవ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ. 69 వేల వరకు జీతం!

Hanmakonda | లేడీస్‌ హాస్టల్‌లో అర్ధరాత్రి దొంగతనం చేసి బావిలో పడ్డ దొంగ.. తెల్లారి బయటకుతీస్తే అసలు విషయం తెలిసింది!

Waltair Veerayya Collections | చిరంజీవి మెగా మేనియా.. బాక్సాఫీసు దగ్గర దుమ్ముదులుపుతున్న వాల్తేరు వీరయ్య

Alia Bhatt | మూడు నెలల కిందటే పాపకు జన్మనిచ్చిన ఆలియా భట్.. మళ్లీ తల్లి కాబోతుందా?

Sarfaraz Khan | అర్జున్‌ టెండూల్కర్‌ కంటే అదృష్టవంతుడిని నాన్నా.. తండ్రితో సర్ఫరాజ్‌ఖాన్‌ భావోద్వేగం

viral news | పురుషుడిగా మారాక వదిలేసిన యువతి.. కావాలంటే మళ్లీ లేడీగా మారమని సూచన.. ఇద్దరమ్మాయిల ప్రేమ కథలో ట్విస్ట్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News