Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsRishabh Pant | రిషబ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక ప్రకటన.. మోకాలి లిగ్మెంట్ చికిత్స...

Rishabh Pant | రిషబ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక ప్రకటన.. మోకాలి లిగ్మెంట్ చికిత్స సక్సెస్

Rishabh Pant | ముంబైలోని కోకిలాబెన్ దీరుబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారత బ్యాటర్ రిషబ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. పంత్ మోకాలి లింగ్మెంట్ చికిత్స సక్సెస్ అయిందని ప్రకటించింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించింది.

బీసీసీఐ డాక్టర్ పార్దివాలా ఆధ్వర్యంలో రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ 31న ఢిల్లీ నుంచి స్వగ్రామం వెళ్తున్న రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే . ఈ ఘటనలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే డెహ్రాడూన్‌లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ తల, వీపుకు సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. కోలుకున్నాక మోకాలి లిగ్మెంట్ చికత్స కోసం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించారు. తాజాగా ఆ సర్జరీ కూడా సక్సెస్ అయినట్లు బీసీసీఐ తెలిపింది.

ప్రస్తుతం భారత్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్‌లకు పంత్‌ సెలెక్ట్‌ కాకపోవడంతో దొరికిన గ్యాప్‌ను ఫ్యామిలీతో గడుపుదామని అనుకున్నాడు. క్రిస్మస్‌కు దుబాయ్‌లో ధోనీ కుటుంబంతో సరదాగా గడిపిన పంత్‌.. వెంటనే ఇండియా వచ్చాడు. ఢిల్లీ నుంచి తన స్వగ్రామం రూర్కీకి తన బీఎండబ్ల్యూ కారులో బయల్దేరాడు. అయితే ఢిల్లీ – డెహ్రాడూన్‌ హైవేపై హరిద్వార్‌ జిల్లా మంగ్లూర్‌ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కారు అద్దాలు పగులగొట్టుకుని పంత్‌ బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Kerala Biryani | బిర్యాని తిని 20 ఏళ్ల యువతి మృతి.. వారంలో ఇది రెండో ఘటన.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

Chudamani temple | ఆ గుడిలో దొంగతనం చేస్తే పిల్లలు పుడతారట.. వందల ఏళ్లుగా భక్తుల విశ్వాసం.. ఎక్కడ ఉంది ?

Sankranti Holidays | గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు పొడిగించిన ప్రభుత్వం

Viral News | నాకు కేన్సర్ అని అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్.. డాక్టర్‌ను వేడుకున్న ఆరేళ్ల బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వైద్యుడి ట్వీట్!

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు ? ఆలయ విశేషాలేంటి.. శిల్పులు ఎవరు ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News