Monday, April 29, 2024
- Advertisment -
HomeEntertainmentAdipurush in OTT | ఆదిపురుష్ ఓటీటీలోకి వచ్చేది ఆ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ కూడా అప్పుడే

Adipurush in OTT | ఆదిపురుష్ ఓటీటీలోకి వచ్చేది ఆ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ కూడా అప్పుడే

Adipurush in OTT | ఆదిపురుష్ సినిమా థియేటర్‌లోకి వచ్చేసింది. సినిమా హాల్స్‌ అన్నీ చిన్న సైజు ఆలయాలుగా మారిపోయాయి. ప్రేక్షకులు భక్తిభావజాలంలో మునిగిపోయి హనుమంతుడి సీటును ప్రత్యేకంగా అలంకరించి పూజలు కూడా చేస్తున్నారు. మొత్తానికి నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు అంతా రామ కథలో లీనమయ్యారు. ఇలాంటి టైమ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఆదిపురుష్ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

భారీ అంచనాలతో వస్తున్న ఆదిపురుష్ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. ఈ విషయం గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇవాళ సినిమా మొదటి ఆట పడిన తర్వాత దీనిపై క్లారిటీ వచ్చేసింది. అన్ని భాషలకు కలిపి రూ.150 కోట్లకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్య వస్తున్న అన్ని సినిమాల మాదిరిగా ఇది కేవలం 30 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు. థియేటర్‌లో సినిమా రిలీజైనప్పటి నుంచి 8 వారాల తర్వాతనే ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుందని సమాచారం.

రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు. ఇందులో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ నటించారు. ఇక లంకాధిపతి లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించాడు. రెట్రో ఫైల్స్, టీ సిరిస్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తోంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Kajal Aggarwal | మళ్లీ తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్

Adipurush | ఆలయాలుగా మారిన ఆదిపురుష్ థియేటర్లు.. హనుమంతుడి సీటు ఎలా ఉందో చూశారా?

Pan Card Number | మీ పాన్ నంబర్ మాటిమాటికి మరిచిపోతున్నారా? ఈ చిన్న లాజిక్‌తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News