Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentJames Cameron and Rajamouli | హాలీవుడ్‌లో రాజమౌళికి ఊహించని సర్‌ప్రైజ్.. ఆఫర్‌ ఇచ్చిన అవతార్‌...

James Cameron and Rajamouli | హాలీవుడ్‌లో రాజమౌళికి ఊహించని సర్‌ప్రైజ్.. ఆఫర్‌ ఇచ్చిన అవతార్‌ డైరెక్టర్ కామెరూన్‌!

James Cameron and Rajamouli | ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లిన రాజమౌళికి హాలీవుడు దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

కొద్ది రోజుల కిందట ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో పాటు క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ వేడుకకు హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను రాజమౌళి కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్ఆర్‌ఆర్ చిత్రాన్ని రెండు సార్లు చూసినట్లు కామెరూన్‌ తెలిపారు. తాజాగా వీరిద్దరి మాట్లాడుకున్న వీడియోను ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది.

”మీరు ఎప్పుడైనా హాలీవుడ్‌లో మూవీ తీయాలనుకుంటే చెప్పండి.. మాట్లాడుకుందాం.. అని రాజమౌళితో కామెరూన్ అంటున్న వీడియో ఇక్కడ ఉంది” అంటూ వీడియోను షేర్‌ చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌. ఈ వీడియోలో కామెరూన్‌ తాను ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాని రెండు సార్లు చూసినట్లు తెలిపారు.

రాజమౌళి కూడా ఆయనతో మాట్లాడుతూ… సార్‌ నేను మీ చిత్రాలన్నింటిని చూశాను. టెర్మినేటర్‌, అవతార్‌, టైటానిక్‌ అన్ని చిత్రాలు చూశాను. మీరు నాకో పెద్ద స్ఫూర్తి. మీ పని తనాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నాను అని పేర్కొన్నారు.

దానికి ప్రతిగా కామెరూన్‌ కూడా మాట్లాడుతూ… నేను ఈ సినిమాలోని పాత్రలను చూశాను. చూస్తుంటే ఎంత సేపైనా చూడాలనిపించే ఫీలింగ్‌ కలిగింది. ఈ స్టోరీ గురించి వివరించే తీరు బాగుంది.

ఫైర్‌, వాటర్‌, స్టోరీతో కథలో పాత్రలను పరిచయం చేయడం ఆసక్తికరంగా ఉంది. పాత్రలు ఏం చేయాలో. ఎందుకు చేస్తున్నాయో బాగా చూపించారు. ట్విస్టులు, మలుపులు, స్నేహం అంతా బాగుంది. స్నేహితుల మధ్య వైరం వచ్చినప్పుడు చంపే అవకాశం వచ్చినా చంపకపోవడం బాగుంది. నాకు సినిమా చాలా బాగా నచ్చింది అని కామెరూన్ అన్నారు.

కామెరూన్‌ మాట్లాడిన తరువాత రాజమౌళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మీ నుంచి ఈ మాటలు వింటుంటే నాకు అవార్డు వచ్చిన దాని కంటే ఎక్కువ ఆనందంగా ఉంది. మీరు నా సినిమా చూడటమే కాకుండా చూసి విశ్లేషిస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఓ మై గాడ్‌ తట్టుకోలేకపోతున్నాను అని అన్నారు. అంతే కాకుండా ఆయన రెండు సార్లు మీ సినిమాని చూశారని కామెరూన్‌ భార్య కూడా రాజమౌళికి చెప్పారు.

“మీరు ఎప్పుడైనా ఇక్కడ సినిమా చేయాలనుకుంటే నాతో చెప్పండి” అంటూ కామెరూన్ రాజమౌళికి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. దీంతో రాజమౌళితో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకవేళ రాజమౌళి హాలీవుడ్ సినిమా చేస్తే కామెరూన్‌‌తో కలిసి చేస్తారని సినీ అభిమానులు అనుకుంటున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rajamouli | ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసిన అవతార్ సృష్టికర్త జేమ్స్ కామెరూన్.. ఆనందాన్ని పంచుకున్న రాజమౌళి

Natu Natu | ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ముందే నాటు నాటు సాంగ్ చిత్రీకరణ.. పర్మిషన్ ఇవ్వడానికి కారణమిదే!

Natu Natu song | గల్లీ బాయ్ పేరు.. అంతర్జాతీయ వేదిక పై.. గర్వంగా ఉందంటూ ఎమోషన్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

RRR Golden Globe Award | తాను రాసిన పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడంపై భావోద్వేగానికి గురైన చంద్రబోస్.. ఏమన్నారో తెలుసా ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News