Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentRRR Golden Globe Award | తాను రాసిన పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడంపై భావోద్వేగానికి...

RRR Golden Globe Award | తాను రాసిన పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడంపై భావోద్వేగానికి గురైన చంద్రబోస్.. ఏమన్నారో తెలుసా ?

RRR Golden Globe Award | ఆర్ఆర్ఆర్ చిత్రం సినీ అభిమానులందరినీ ఎంతో గర్వపడేలా చేసింది. రికార్డులతో చరిత్రలో కొత్త అధ్యాయం రచించింది. సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. తాజాగా ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గానూ గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది.

అవార్డును గెలుచుకున్న సమయంలో రాజమౌళి టీం సంబరాలు చేసుకుంది. తెలుగు సినిమా పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజమౌళి ప్రతిభను చూసి భారత దేశం గర్వపడుతోందంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

నాటు నాటు పాటకు అవార్డు రాగానే స్పందించిన మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు ఏఆర్ రెహ్మన్‌ కూడా ”ఇదో అద్భతం.. నమ్మశక్యం కానిది.. ఇండియా తరుపున.. భారతీయ అభిమానుల తరుపున కీరవాణి గారికి కంగ్రాట్స్.. రాజమౌళి గారికి, ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్” అని ట్వీట్ చేశారు.

మరోవైపు నాటునాటు పాట రచయిత చంద్రబోస్‌ కూడా స్పందించారు. ఈ అవార్డు రావడం పట్ల ఎంతో భావోద్వేగానికి లోనైనట్లు తెలిపారు. ”నేను రాసిన పాట అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని అసలు ఊహించలేదు. ఎన్నో అంతర్జాతీయ పాటలను, ఎంతో మంది దిగ్గజాలను వెనక్కి నెట్టి ‘నాటు..నాటు’ పాట ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన చంద్రబోస్ కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి చిత్రంలో పాట రాసేందుకు అవకాశం కల్పించిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ, చిత్ర దర్శకుడు రాజమౌళికి ఆయన ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు.

పాటను అత్యద్భుతంగా పాడిన రాహుల్ సిప్లిగంజ్‌ తో పాటు తెర మీద ఎంతో అందంగా డ్యాన్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ తో పాటు ఈ పాటకి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఈ క్రెడిట్ దక్కుతుందని చంద్రబోస్ పేర్కొన్నారు.

నాటు నాటు పాటకు గోల్డోన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా ఆనందాల్లో తేలియాడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఆస్కార్‌ అవార్డు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

Oscars 2023 | సైలెంట్‌గా ఆస్కార్ బరిలోకి నిలిచిన కాంతార.. సౌత్ నుంచి ఇంకా ఏ సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News