Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsIT Hubs in telangana | తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తరిస్తున్న ఐటీ.. ఏ...

IT Hubs in telangana | తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తరిస్తున్న ఐటీ.. ఏ జిల్లాలో ఐటీ హబ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి?

IT Hubs in telangana | తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. త్రీడీ మంత్రలో భాగంగా జిల్లా కేంద్రాల్లోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ప్రపంచమంతా డిజిటలైజేషన్, డీకార్భనైజేషన్, డీసెంట్రలైజేషన్ అనే త్రీడీలో దూసుకుపోతుందన్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఐటీ విస్తరించేందుకు కొత్త అవకాశాలను, క్రియేటీవ్ విధానాలను ప్రోత్సహించేందుకు దోహదపడుతుందన్నారు. ఇంతకీ తెలంగాణలోని ఏ ఏ నగరాల్లో ఐటీ సేవలు విస్తరించాయి.. విస్తరించబోతున్నాయో ఓసారి లుక్కేయండి మరి..

  • వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ హబ్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి.
  • నిజామాబాద్‌లో ఐటీ హబ్ దాదాపు పూర్తయింది. త్వరలోనే ప్రారంభించనున్నారు.
  • మహబూబ్ నగర్‌లోనూ ఐటీ హబ్ పూర్తయింది. నెల రోజుల్లో ప్రారంభించనున్నారు.
  • సిద్దిపేటలోనూ ఐటీ హబ్ రూపుదిద్దుకుంటోంది. మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. నిజామాబాద్, మహబూబ్‌నగర్ లో ప్రారంభం కాగానే సిద్దిపేటలో ప్రారంభించనున్నారు.
  • నల్లగొండలోనూ ఐటీ హబ్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. మరో నాలుగు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల అసమ్మతి రాగం.. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే ఆలోచనలో నేతలు.. భట్టికి కోమటిరెడ్డి ఫోన్

Leopard entered in hetero lab | హైదరాబాద్ శివారులోని హెటిరో ల్యాబ్‌లో చిరుత.. 11 గంటలు కష్టపడి పట్టుకున్న అధికారులు

Fire Accident | మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవ దహనం.. ప్రమాదమా? కావాలనే నిప్పు పెట్టారా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News