Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentLove today in OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్‌ టుడే.. స్ట్రీమింగ్‌ అయ్యేది ఎప్పుడంటే..

Love today in OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్‌ టుడే.. స్ట్రీమింగ్‌ అయ్యేది ఎప్పుడంటే..

Love today in OTT | ఇప్పుడు సెల్‌ఫోన్లే ప్రపంచం అయిపోయాయి. ఆప్తమిత్రుడికి కూడా తెలియని మన రహస్యాలు మన మొబైల్‌కు మాత్రమే తెలుసు. మరి అంత పర్సనల్‌గా తన ఫోన్లను ఇద్దరు ప్రేమికులు మార్చుకుంటే పరిస్థితేంటి? వాళ్ల జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి. ఎవరికీ తెలియని తమ నిజస్వరూపాలను ఒకరికొకరు తెలుసుకుంటే కలిసి ఉండగలారా? వినడానికే కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది కదా ! ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది లవ్‌ టుడే.

తమిళనాట చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే 60 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇదే క్రేజ్‌తో నవంబర్‌ 25న తెలుగులో రిలీజై ఇక్కడ కూడా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కథానాయిక ఇవానా అందరికీ నచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నెల 25న క్రిస్మస్‌ కానుకగా లవ్‌ టుడే చిత్రాన్ని స్ట్రీమింగ్‌ చేయాలని అనుకుంటుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Sundeep kishan – rejina cassandra | సందీప్ కిషన్‌తో రెజీనా ప్రేమాయణం.. టాలీవుడ్‌లో వైరల్‌గా మారిన పోస్టు..

Dil Raju | వారసుడు సినిమాకు విజయ్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ కాదంట.. టాలీవుడ్‌ హీరోలు మిస్‌ చేసుకోవడంతో ఆఫర్‌ పట్టేశాడు

Atlee kumar | పెళ్లయిన 8 ఏళ్లకు తల్లిదండ్రులు అవుతున్న మరో సెలబ్రెటీ కపుల్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News