Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsAir India urination case | విమానంలో మూత్ర విసర్జన ఘటనలో ఎయిరిండియాకు భారీ జరిమానా.....

Air India urination case | విమానంలో మూత్ర విసర్జన ఘటనలో ఎయిరిండియాకు భారీ జరిమానా.. పైలట్‌ లైసెన్స్‌ రద్దు

Air India urination case | విమానంలో మూత్ర విసర్జన ఘటనను తీవ్రంగా పరిగణించిన పౌర విమానయాన శాఖ (డీజీసీఏ) ఎయిరిండియాకి 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ విమాన పైలట్ ని మూడు నెలలపాటు సస్పెండ్ చేసింది. పైగా డైరెక్టర్ ఆఫ్ ఇన్-ఫ్లయిట్ సర్వీస్‌కి 3 లక్షల ఫైన్ కూడా విధించినట్టు ఈ శాఖ వర్గాలు తెలిపాయి.

గత ఏడాది నవంబరు 26 న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఈ విమానంలో మద్యం తాగిన మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి ఓ మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం సృష్టించింది. ఈ ఘటనలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, ఎయిర్ క్రాఫ్ట్ రూల్ 141 ని పైలట్-ఇన్-కమాండ్ అతిక్రమించాడని, అందువల్ల అతని లైసెన్స్ ని మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నామని డీజీసీఏ తెలిపింది.

అలాగే ఇన్-ఫ్లయిట్ సర్వీసెస్ డైరెక్టర్ కూడా తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని పేర్కొంది. శంకర్‌ మిశ్రాను 4 నెలలపాటు విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించింది. బెంగుళూరులో శంకర్ మిశ్రాని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆ తరువాత శంకర్ మిశ్రా .. బాధిత మహిళకు పరిహారం చెల్లించానని, తమ మధ్య వివాదం పరిష్కారమైందని అధికారులకు తెలిపాడు.

అయితే ఇందులో తన క్లయింట్ తప్పేమీ లేదని, బాధిత మహిళే తనపై తాను మూత్రం పోసుకుందని మిశ్రా తరఫు లాయర్ కోర్టుకు తెలిపాడు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను కూడా ప్రస్తావిస్తూ 30 ఏళ్లుగా భరతనాట్యం డ్యాన్సర్ అయిన ఆమెకు ఇలాంటి సమస్య ఉండడం సహజమేనని అన్నాడు. ఆమెకు ఏదో శారీరక సమస్య ఉన్నట్టు కనిపిస్తోందన్నాడు. ఈ కేసులో శంకర్ మిశ్రా ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vijay Antony | బిచ్చగాడు హీరో పరిస్థితి విషమం అంటూ వార్తలు.. క్లారిటీ ఇదీ

DCW chief Swati Maliwal | ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌కే రక్షణ లేదు.. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి?

comedian vadivelu | కమెడియన్ వడివేలు ఇంట్లో తీవ్ర విషాదం

amala paul | మా గుడిలోకి రావొద్దు.. హీరోయిన్‌ను అడ్డుకున్న ఆలయ అధికారులు.. ఎందుకంటే..

Accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా 9 మంది మృతి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News