Friday, April 19, 2024
- Advertisment -
HomeNewsInternationalDonald Trump | ఐ యామ్ బ్యాక్ అంటున్న ట్రంప్..రీ స్టార్ట్ అయిన ట్రంప్ ఎఫ్బీ,...

Donald Trump | ఐ యామ్ బ్యాక్ అంటున్న ట్రంప్..రీ స్టార్ట్ అయిన ట్రంప్ ఎఫ్బీ, యూట్యూబ్!

Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో తిరిగి యాక్టివ్ అయ్యారు. గత కొంతకాలంగా ఆయన యూట్యూబ్, ఫేస్ బుక్ అకౌంట్లను నిలుపదల చేశారు. అప్పటి నుంచి ఆయన అకౌంట్ లు కూడా పని చేయడం లేదు. రెండేళ్ల తరువాత ఇవి మళ్లీ రీస్టోర్ అయ్యాయి. ఇదే విషయాన్ని ట్రంపే స్వయంగా తెలియజేశారు.

ట్రంప్ నకు ఫేస్ బుక్ లో సుమారు 3 కోట్ల మంది, యూట్యూబ్ లో 26 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్ బుక్ అకౌంట్ రీ యాక్టివ్ అయినట్లు ట్రంప్ పోస్ట్ చేశారు. ‘ “”I’M BACK” అంటూ ఓ వీడియో షేర్ చేశారు. 2016లో అధ్యక్ష ఎన్నికల తరవాత కీలక ప్రసంగం చేశారు. ఆ వీడియోలో మొదటి 12 సెకన్లు ఎడిట్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు ట్రంప్. 2021 జనవరి 6 వ తేదీ నుంచి ఆయన అకౌంట్లు బ్లాక్ అయ్యాయి. మళ్లీ ఇన్ని సంవత్సరాల తరువాత అవి రీస్టోర్ అయ్యాయి. దీనిపై YouTube కీలక ప్రకటన చేసింది. ట్రంప్ అకౌంట్పై బ్యాన్ను ఎత్తివేస్తున్నామని వెల్లడించింది.

ఈరోజు నుంచి డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ పై ఉన్న నిషేదాన్ని ఎత్తివేస్తున్నాం. ఇప్పటి నుంచి ట్రంప్ కొంత కంటెంట్ ను అప్లోడ్ చేసుకోవచ్చు” అని అమెరికా తెలిపింది. అంతకు ముందు ట్విటర్ అకౌంట్ను కూడా రీస్టోర్ చేసింది అమెరికా. గతేడాది నవంబర్లో ఈ నిషేధం ఎత్తి వేశారు. దాదాపు 22 నెలల తర్వాత ట్విట్టర్ లో మళ్లీ ట్రంప్ ఖాతా శనివారం కనిపించింది. 2021లో జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్ వద్ద హింసను ప్రేరేపించింనందుకు ట్రంప్ ఖాతాను సస్పెండ్ చేశారు.

ట్రంప్ ఖాతాను పునరుద్ధరించేందుకు ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించారు. 15 మిలియన్ల మంది ట్విట్టర్ వినియోగదారులు ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. ట్రంప్ ఖాతాపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి అనుకూలంగా 51.8 శాతం ఓట్లు వచ్చాయి. అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై సస్పెన్షన్ ఎత్తివేసి, అకౌంట్ పునరుద్ధరించారు. ట్విట్టర్ కి తిరిగి రావడానికి తనకు ఆసక్తి లేదని ట్రంప్ భిన్నంగా స్పందించారు.

ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అభివృద్ధి చేసిన తన కొత్త ఫ్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇది ట్విట్టర్ కంటే మెరుగ్గా ఉందని ట్రంప్ అన్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. రిపబ్లికన్ యూదుల సంకీర్ణ వార్షిక నాయకత్వ సమావేశంలో ప్యానెల్ ద్వారా ట్విట్టర్కు తిరిగి రావాలని అలోచిస్తున్నారా అన్న ప్రశ్నకు ” తిరిగి రావడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు,” అని అమెరికా మాజీ అధ్యక్షుడు చెప్పారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | అత్తారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను పుట్టింటికి వెళ్లిపోతా.. పెళ్లయిన కాసేపటికే వరుడికి షాకిచ్చిన వధువు

Naveen Murder Case | నవీన్‌ మర్డర్‌ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల

Naatu Naatu | నాటు నాటు పెడితే కానీ.. నా కొడుకు అన్నం తినడం లేదు.. కరీనా కపూర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News