Home Latest News India Vs New Zealand | రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 2-0...

India Vs New Zealand | రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం

Image Source: Indian Cricket Team

India Vs New Zealand | రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగుతున్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. 109 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

న్యూజిలాండ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం 20.1 ఓవర్లలోనే చేధించింది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ 47 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. 51 పరుగులకు ఔటయ్యాడు. విరాట్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్ 40 , ఇషాన్ కిషన్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. న్యూజీలాండ్ బౌలర్లలో హెన్రీ, మిచెల్ చెరో వికెట్ తీశారు.

తొలుత టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించింది. భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 15 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. టాప్ ఆర్డర్‌లో ఫిన్ అలెన్ డక్ ఔట్ అవగా.. డెవాన్ 7 పరుగులు, హెన్రీ రెండు, డారిల్ మిచెల్ 1, లేథమ్ ఒక పరుగు మాత్రమే చేశారు. ఫిలిప్స్ అత్యధికంగా 36 పరుగులు చేయగా.. మైఖేల్ బ్రాస్ వెల్ 22 పరుగులు, మిచెల్ శాంటర్న్ 27 పరుగులు చేయగలిగారు. భారత బౌలర్లు విజృంభించడంతో 34.3 ఓవర్లకే 108 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్ అయింది.

భారత బౌలర్లలో షమీ మూడు, హార్దిక్ పాండ్య , వాషింగ్టన్ సుందర్ 2, సిరాజ్, శార్దూల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీయడంతో 34.3 ఓవర్లకే న్యూజిలాండ్ కుప్పకూలింది. వన్డేల్లో భారత్‌పై కివీస్‌కు ఇది మూడో అత్యల్ప స్కోరు కావడం విశేషం. 2010లో చెన్నైలో జరిగిన వన్డేలో 103 పరుగులకే చేతులెత్తేసింది. 2016లో విశాఖ పట్నం వేదికగా కేవలం 79 పరుగులకే ఆలౌటైంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hyundai grand i10 | తక్కువ ధరకే కారు కావాలా? 6 లక్షల లోపే వస్తున్న ఈ కారుపై ఓ లుక్కేయండి

Rohit Sharma Interview | ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు డబుల్ సెంచరీ వీరులు.. వైరల్‌ అవుతున్న రోహిత్‌ శర్మ ఇంటర్వ్యూ వీడియో

Uppal Match | ఉప్పల్‌లో శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ.. ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్‌పై భారత్‌ ఘన విజయం

Modi Telangana Tour | ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

Pawan Kalyan | కొండగట్టు అంజన్న మీద పవన్‌ కళ్యాణ్‌కి అంత సెంటిమెంట్‌ ఎందుకు ? వారాహికి అక్కడే పూజలు చేయడానికి కారణమేంటి ?

viral news | విలాసాల కోసం అండాలను అమ్మకానికి పెట్టిన మహిళ.. ప్రశ్నించిన భర్తను చంపేస్తానని వార్నింగ్‌!

Exit mobile version