Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsInternationalIndia record victory | టీమిండియా రికార్డు విక్టరీ.. బంగ్లాదేశ్ పై 227 పరుగుల తేడాతో...

India record victory | టీమిండియా రికార్డు విక్టరీ.. బంగ్లాదేశ్ పై 227 పరుగుల తేడాతో విజయం

India record victory | మూడో వన్డేలో బంగ్లాదేశ్ ను భారత్ చిత్తు చేసింది. భారత్ నిర్దేశించిన 410 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో 182 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌటైంది. దీంతో భారత్ 227 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో భారత్ గెలిచిన మూడో మ్యాచ్ ఇదే కావడం విశేషం. అంతేకాదు గతంలో బంగ్లాదేశ్ పై భారత్ 370 పరుగులే అత్యధికం. కాగా ఇప్పుడా రికార్డును అధిగమించింది.

మూడు వన్డేల సిరీస్ లో బంగ్లాదేశ్ తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డేలో మాత్రం భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. వన్డేల్లో భారత్ ఆరోసారి 400 పరుగుల దాటింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (210) తో చెలరేగిపోవడంతో పాటు విరాట్ కోహ్లీ 113 పరుగులు చేయడంతో భారీ స్కోర్ చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్ 37 పరుగులు, అక్షర్ పటేల్ 20 పరుగులతో రాణించారు. శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వరుసగా 3, 3, 8 పరుగుల చేసి విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ 2 వికెట్లు, షకిబ్ రెండు, ఎబాడట్ రెండు, ముస్తాఫిజర్, మెహిదీ తలో వికెట్ తీశారు.

భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ నడ్డివిరిచాడు అక్షర్ పటేల్. అక్షర్ వేసిన తొలి బంతికే అనముల్ 8 పరుగుల వద్ద భారీ షాట్ కు యత్నించి సిరాజ్ చేతికి చిక్కాడు. తర్వాత స్వల్ప స్కోరుకే మరో ఓపెనర్ లిటన్ దాస్ పెవిలియన్ చేరాడు. భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటర్లు పరుగుల రాబట్టలేకపోయారు. 182 పరుగులకే చాపచుట్టేశారు. భారత బౌలర్లలో శార్దూల్ 3 వికెట్లు, ఉమ్రాన్ 2, అక్షర్ పటేల్ 2, సిరాజ్ , కుల్దీప్ , వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను మెహిదీ హసన్ మిరాజ్ దక్కించుకున్నాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Ishan Kishan | ఇసాన్ కిషన్ రికార్డు డబుల్ సెంచరీ

FIFA World cup 2022 | మెస్సీ మెరుపులు.. సెమీస్‌కు చేరిన అర్జెంటీనా

FIFA world cup | ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో సంచలనం.. బ్రెజిల్‌ను ఓడించిన క్రొయేషియా

Cricket records | ఆరంగేట్రంలోనే అదుర్స్‌ అనిపించిన పాక్‌ బౌలర్‌.. 24 ఏళ్లకే అరుదైన రికార్డు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News