FIFA world cup Croatia vs Brazil| ఫిఫా పుట్‌బాల్ ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ క్వార్టర్స్‌లో మట్టికరిచింది. హోరాహోరీగా సాగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ప్రపంచనంబర్ 1 స్థానంలో ఉన్న బ్రెజిల్.. క్రొయేషియా చేతిలో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి. దీంతో ఫెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది.
ఫెనాల్టీ షూటౌట్‌ను సద్వినియోగం చేసుకున్న క్రొయేషియా నాలుగు గోల్స్ చేసింది. బ్రెజిల్ మాత్రం రెండు గోల్స్‌తో సరిపెట్టుకోవడంతో క్రొయేషియా సెమీస్‌కు చేరింది. ఈసారి కప్ కొడుతుందనుకున్న బ్రెజిల్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో అభిమానులు షాక్‌లో ఉండిపోయారు. గత ప్రపంచకప్‌లో క్రొయేషియా రన్నరప్‌గా నిలిచిని విషయం తెలిసిందే.
అంతకుముందు ప్రీక్వార్టర్‌లో ఫైనల్లో దక్షిణ కొరియాను 4-1 గోల్స్ తేడాతో బ్రెజిల్ మట్టికరిపించింది. ఈ విజయంతో బ్రెజిల్ 14వ సారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
Read More Articles |
Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం
Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి