Cricket records | పాకిస్థాన్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో పాక్ బౌలర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్ యువ స్పిన్నర్ అబ్రర్ అహ్మత్ ఆరంగేట్రం టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అద్భుత ప్రదర్శన చేశాడు. 24 ఏండ్ల అబ్రర్ మొదటి ఇన్నింగ్స్లో ఏకండా 7 వికెట్లు పడగొట్టాడు. మొదటి ఐదు వికెట్లను వరుసగా అబ్రరే తీయడం విశేషం.
మొదటి ఇన్నింగ్స్లో మొత్తం 22 ఓవర్లు వేసి 114 పరుగులిచ్చాడు. ఏడు వికెట్లు తీశాడు. కాగా ఆరంగేట్రం టెస్టు మొదటి ఇన్నింగ్స్లో అద్భుత ప్రదర్శన చేసిన మూడో బౌలర్గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు తొలి టెస్ట్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన 13వ పాకిస్థాన్ బౌలర్గా రికార్డు సృష్టించాడు.
పాకిస్థాన్లో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. రెండో టెస్టులో గెలిచి సిరీస్ను సమం చేయాలని పాకిస్థాన్ భావిస్తోంది.
Read More Articles |
- Jio Airfiber | మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైన జియో.. ఈసారి ACT, Hathway కూడా దిగిరావాల్సిందేనా!
- 69th National Film Awards 2023 | తెలుగు చిత్రాలకు అవార్డుల పంట.. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్..
- Love You Ram Review | లవ్ యూ రామ్ రివ్యూ
- SaiChand | తెలంగాణ మలిదశ ఉద్యమ గాయకుడు సాయిచంద్ అకాల మరణం.. భావోద్వేగానికి గురైన సీఎం కేసీఆర్
- horoscope today | రాశిఫలాలు ( 24-06-2023 )