Tuesday, June 18, 2024
- Advertisment -
HomeNewsInternationalEconomic Crisis | కిలో ఉల్లిపాయలు రూ.220…. లీటర్ పాలు రూ.150…చికెన్‌ కిలో 384 రూపాయలు.....

Economic Crisis | కిలో ఉల్లిపాయలు రూ.220…. లీటర్ పాలు రూ.150…చికెన్‌ కిలో 384 రూపాయలు.. ఎక్కడంటే..!!

Economic Crisis | కేజీ ఉల్లిపాయలు రూ.220 , లీటర్‌ పాలు రూ.150… ఏంటి వీటి ధర ఇంతలా ఎప్పుడూ పెరిగాయి అనుకుంటున్నారా..!. ఇది మన దేశంలో కాదు… మన పక్కనే ఉన్న దాయాది దేశంలో. పాకిస్తాన్‌ లో తీవ్ర సంక్షోభం తాండవం చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌ మరో శ్రీలంకలా తయారయ్యింది. నిత్యావసర వస్తువుల కొరత అతి తీవ్రంగా ఉంది.

పాక్‌ లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ పాకిస్తాన్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం.. పాక్‌ లో విదేశీ మారక నిల్వలు 8 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. సుమారు 5.5 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఈ మొత్తంతో, పాక్‌ కేవలం 3 వారాలకు సరిపడ వస్తువులను మాత్రమే దిగుమతి చేసుకోగలదు.

పాక్‌ లో విదేశీ రుణాలు నిరంతరం పెరుగుతుండగా, విదేశీ మారక ద్రవ్యం ఎప్పటికప్పుడు తగ్గిపోతుంది. అక్కడి ప్రధాన వార్తాపత్రిక డాన్‌ నివేదిక ప్రకారం… మార్చి 2022 నాటికి, దేశం తల పై ఉన్న మొత్తం విదేశీ అప్పు 43 లక్షల కోట్ల పాక్‌ రూపాయలకు చేరుకుంది. ఈ అప్పులో ఎక్కువ శాతం ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం హయంలోనిదే.

ఆయన కేవలం 3 సంవత్సరాలలో మొత్తం 1400 వేల కోట్ల పాకిస్తానీ రూపాయల రుణం తీసుకున్నాడు. దీంతో దేశంలో విదేశీ మారకద్రవ్యం దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే అని తెలుస్తోంది.

గతేడాది జనవరిలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాక్‌ వద్ద 2022 జనవరిలో మొత్తం 16.6 బిలియన్‌ డాలర్లు ఉంటే, ఇప్పుడు ఆ నిల్వ 5.6 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. కేవలం ఏడాది వ్యవధిలోనే 11 బిలియన్‌ డాలర్ల మేర తగ్గాయి. అసలు దీని వెనుక ఉన్న అతి పెద్ద కారణం విదేవీ రుణాల వాయిదాలు చెల్లించడం.

గోధుమ పిండి కోసం తొక్కిసలాటలు

ద్రవ్యోల్బణం అతి తీవ్రంగా పెరగడం వల్ల… పెరిగిన ధరల వల్ల ఆహారాన్ని కొనుక్కునేంత స్థోమత లేక మధ్య తరగతి ఆదాయ వర్గాలు కూడా అర్ధాకలితో రోజులు వెళ్లదీస్తున్నాయి. ప్రభుత్వం సబ్సిడిలో అందిస్తున్న గోధుమ పిండి కోసం వేలాది ప్రజలు గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల తొక్కిసలాటలు జరిగి ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. చాలా ప్రాంతాల్లో సాయుధ బలగాల పహారాలో ఆహార పదార్థాలను పంపిణీ చేసే పరిస్థితి నెలకొంది.

డజను అరటి పండ్లు రూ. 119

గతేడాది కేజీ రూ. 37గా ఉన్న ఉల్లిపాయలు… ఇప్పుడు ఏకంగా రూ.220 కి చేరింది. డజను అరటిపళ్లు 119 రూపాయలు, కిలో చికెన్‌ 384 రూపాయలు, లీటర్‌ పాలు 150 రూపాయలు… ఇలా ప్రతి వస్తువుకు రెక్కలు వచ్చాయి. ఇక పెట్రోల్‌ ధరలు అయితే 48 శాతం, డీజిల్‌ ధరలు 61 శాతం పెరిగాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్రమైన పరిస్థితిలో ఉంది.

దేశాన్ని పాలిస్తున్న షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం, ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలు జరుపుతోంది. IMF ప్యాకేజీలోని తదుపరి విడతను వీలైనంత త్వరగా పొందడానికి ప్రయత్నిస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More:

Natu Natu | ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ముందే నాటు నాటు సాంగ్ చిత్రీకరణ.. పర్మిషన్ ఇవ్వడానికి కారణమిదే!

China Corona cases | చైనాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.. అక్కడ 90 శాతం మందికి కరోనా!

Surya Kumar Yadav | భారతీయుడు కావడం అతని అదృష్టం.. మా దేశంలో పుట్టి ఉంటే.. పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Brazil | బ్రెజిల్‌లో యూఎస్ క్యాపిటల్ విధ్వంసం తరహాలో ఘటన.. అధ్యక్ష భవనంలో ఆందోళనకారుల విధ్వంసం.. పరిస్థితి ఉద్రిక్తం

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News