Tuesday, May 28, 2024
- Advertisment -
HomeLatest NewsMarry Now Pay later | పెళ్లి కాని యువతీయువకులకు బంపర్ ఆఫర్.. ఎంత కావాలంటే...

Marry Now Pay later | పెళ్లి కాని యువతీయువకులకు బంపర్ ఆఫర్.. ఎంత కావాలంటే అంత లోన్ మీకోసమే !

Marry Now Pay later | ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే జీవితంలో ఈ రెండింటి కోసం భారీగా డబ్బులు ఖర్చవుతుంటాయి. అంత ఖర్చు చేశాక ఆర్థికంగా పుంజుకోవడం అంత సులువు కాదు. అందుకే పూర్వకాలం నుంచి పెద్దలు ఈ మాట చెబుతున్నారు. పూర్వం సంగతేమో గానీ ఇప్పుడైతే పెళ్లిళ్లు చేసుకునేవారు ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. జీవితంలో ఒకేసారి చేసుకునే వేడుక అంటూ బోలెడంత డబ్బు ఖర్చు పెడుతూ ప్రీవెడ్డింగ్ షూట్‌లు, డెస్టినేషన్ మ్యారేజెస్ చేసేకుంటున్నారు. అయితే కొంతమందికి గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని ఉన్నా సరిపడా డబ్బు లేక వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారికోసమే ఇప్పుడు మార్కెట్లో ఓ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. మీ పెళ్లికి కావాల్సినంత డబ్బు తీసుకుని.. ఆ తర్వాత ఈఎంఐ రూపంలో వాయిదాలు చెల్లిస్తే సరిపోతుంది. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ.. మరీ ఈ ఆఫర్ విశేషాలంటో ఒకసారి తెలుసుకుందాం..

ట్రావెల్ ఫిన్ టెక్ సంస్థ సన్‌ క్యాష్‌ , రాడిసన్ హోటళ్ల భాగస్వామ్యంతో మ్యారీ నౌ పే లేటర్ స్కీమ్ ని ప్రారంభించింది. ప్రస్తుతానికి ఈ ఆఫర్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ప్రముఖ ప్రదేశాలతో పాటు జైపూర్, చండీగఢ్, పుణేలోని హోటళ్లలో త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే దశల వారీగా దేశ వ్యాప్తంగా కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సంకాష్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ ఆకాష్ దహియా చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి రాడిసన్ హోటళ్లలో ఈ ఆఫర్ అందుబాటులోకి రానుందని వివరించారు. ప్రస్తుతం ఈ స్కీం అందుబాటులో ఉన్న హోటళ్లలో సగటున రోజుకు 50 పైగా కాల్స్, ఎంక్వయిరీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

లోన్ ఎలా పొందాలి?

మ్యారీ నౌ పే లేటర్ స్కీమ్ ద్వారా గరిష్టంగా 25 లక్షల వరకు లోన్‌ పొందవచ్చు. దానిని సుమారు 6 నుంచి 12 నెలల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఎంచుకున్న టైమ్‌ ని బట్టి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. 6 నెలలు అయితే సున్నా వడ్డీ, 12 నెలలు అయితే 1 శాతం వడ్డీతో సన్‌ క్యాష్‌ ఎన్‌బీఎఫ్‌సీలకు ఈఎంఐ చెల్లించాలి. దీని కోసం కస్టమర్ల ఐడీ, అడ్రస్‌ ప్రూఫ్‌, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌, పేస్లిప్స్‌, ఐటీఆర్‌ తదితర అంశాలను పరిశీలించిన తర్వాత మీకు ఎంత లోన్‌ ఇవ్వాలి అన్నది అంచనా వేస్తారు. అన్ని డాక్యుమెంట్స్‌ సరిగ్గా ఉంటే లోన్‌ మంజూరు చేస్తారు. తమ వివాహం కారణంగా కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకూడదని భావించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News