Home Latest News MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను 10 గంటలకు పైగా విచారించిన ఈడీ.. రేపు మళ్లీ...

MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను 10 గంటలకు పైగా విచారించిన ఈడీ.. రేపు మళ్లీ విచారణకు పిలిచిన అధికారులు

MLC Kavitha | లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను 10 గంటలకు పైగా ఈడీ అధికారులు సోమవారం విచారించారు. అనంతరం డాక్యుమెంట్లు, వాంగ్మూలంపై ఆమె సంతకాలు తీసుకున్నారు. దాదాపు 20 ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది.

లిక్కర్‌ కేసులో ఇప్పటికే అరెస్టయిన అరుణ్‌ పిళ్లైతో కవితను కలిపి ఉదయం ఈడీ అధికారులు విచారించారు. పిళ్లైతో ఉన్న వ్యాపార సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం. అటు సాయంత్రం సమయంలో డిల్లీ మాజీ సీఎం మనీశ్ సిసోడియా, అమిత్‌ అరోరాతో కలిసి విచారించారు. కాగా, కవితను విచారణ చేస్తున్న సమయంలోనే ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషినల్ ఏజీ, న్యాయవాదులు సోమా భరత్‌, గండ్ర మోహన్‌ రావు, వైద్యులు లోపలికి వెళ్లారు. దాదాపు 10 గంటలకు పైగా విచారణ అనంతరం కవిత ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. విజయ సంకేతం చూపుతో సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్లారు.

మరోవైపు మంగళవారం మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు సూచించారు. ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలోనే విచారణకు హాజరు కావాలని చెప్పారు.

Exit mobile version