Home Latest News Delhi liquor case | బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు.. మళ్లీ విచారించనున్న సీబీఐ

Delhi liquor case | బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు.. మళ్లీ విచారించనున్న సీబీఐ

Delhi liquor case | బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 91 కింద నోటీసులు ఇచ్చింది. త్వరలోనే కవితను మరోసారి ప్రశ్నించనున్నట్లు సీబీఐ పేర్కొంది. విచారణ ఎప్పుడనేది త్వరలో వెళ్లడిస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం విచారించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు ఏడు గంటలకు పైగా విచారణ జరిపారు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఆదివారం సీబీఐ విచారణ ముగిసిన అనంతరం ప్రగతిభవన్‌కు చేరుకున్న కవిత.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కవిత ఇంటికి చేరుకోగానే.. సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 91 కింద నోటీసులు జారీ చేసింది. విచారణ తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు సీబీఐ వెల్లడించింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

MLC Kavitha Met Telangana CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ.. ఢిల్లీ లిక్కర్‌ కేసు విచారణ సాగిన తీరుపై వివరణ ?

MLC Kalvakuntla Kavitha | ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. సాయంత్రం దాకా విచారణ !

TRC MLC Kalvakuntla Kavitha | నా గురించి మాట్లాడితే చెప్పుతో కొడతా.. బీజేపీ ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

CM KCR Telangana Cabinet Key Decisions | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Exit mobile version