Home News AP Dasara Festival | ద‌స‌రా రోజు పాల‌పిట్ట‌ను ఎందుకు చూడాలి?

Dasara Festival | ద‌స‌రా రోజు పాల‌పిట్ట‌ను ఎందుకు చూడాలి?

Dasara Festival | ద‌స‌రా పండుగ రోజు పాల‌పిట్ట‌ను చూస్తే ఆ ఏడాదంతా మంచి జ‌రుగుతుంద‌ని ఒక న‌మ్మ‌కం. అందుకే విజ‌య ద‌శ‌మి రోజున ఊరి చివ‌ర‌కు, పొలాల ద‌గ్గ‌ర‌కు వెళ్లి మ‌రీ పాల పిట్ట‌ను చూసి వ‌స్తుంటారు. ప‌ర‌మేశ్వ‌రుడి స్వ‌రూపంగా భావించే పాల పిట్ట‌ను ద‌స‌రా నాడు ఎందుకు చూడాలి? దీని గురించి మ‌న పురాణాలు ఏం చెబుతున్నాయి.

త్రేతాయుగంలో రావ‌ణాసురుడితో యుద్ధానికి వెళ్లేముందు శ్రీరాముడికి పాల‌పిట్ట క‌నిపించింద‌ట‌. ఆ యుద్ధంలో విజ‌యం సాధించ‌డంతో పాల పిట్ట‌ను శ్రీరాముడు శుభశ‌కునంగా భావించాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. ద్వాప‌ర యుగంలో అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు పాండ‌వులు జ‌మ్మి చెట్టు మీద దాచిన ఆయుధాల‌కు పాల పిట్ట రూపంలో ఇంద్రుడు కాపలాగా ఉన్నాడ‌ని కూడా పురాణాల్లో ఉంది. అజ్ఞాత వాసం త‌ర్వాత త‌మ రాజ్యానికి వెళ్లేముందు పాండ‌వుల‌కు పాల‌పిట్ట క‌న‌బడింది. అప్ప‌ట్నుంచి వాళ్ల క‌ష్టాల‌న్నీ తొల‌గిపోయాయి. ఏం చేసినా విజ‌యాలు ద‌క్కాయి. అందుకే విజ‌య ద‌శ‌మి రోజు పాల‌పిట్ట‌ను చూడాల‌ని చెబుతుంటారు.

ద‌స‌రా రోజు పాలపిట్ట‌ను చూడ‌టం శుభ‌శ‌కున‌మే. అయితే అది ఉత్త‌రం దిక్కు నుంచి మాత్ర‌మే ఎదురవ్వాలి. ద‌క్షిణం దిక్కు నుంచి వ‌స్తే అశుభానికి సంకేత‌మ‌ని అంటారు.

Exit mobile version