Home News AP Cyclone Mandous | తీరం దాటిన తుఫాన్..ఈ ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు

Cyclone Mandous | తీరం దాటిన తుఫాన్..ఈ ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు

cyclone mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తీవ్ర తుఫాన్ తీరం దాటింది. వాయువ్య దిశగా పయనించిన తుఫాన్ అర్ధరాత్రి దాటిన తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.దీంతో శనివారం ఉదయానికి బలహీనపడి తుఫాన్‌గా మారింది. మధ్యాహ్నం సమయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల చెన్నై నుంచి 21 విమాన సర్వీసులను క్యాన్సిల్ చేశారు. మాండౌస్ తుఫాన్ కారణంగా ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగ గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని 210 మండలాల అధికారులను అప్రమత్తం చేసింది.తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సెలవులను రద్దు చేయడంతో పాటు.. విద్యుత్ పునరుద్ధణ పనులను పర్యవేక్షించేందుకు ఒక కంట్రోల్ రూంను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యుత్ స్తంభాలు కూలిపోయినా.. లైన్లు తెగిపోయినా 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Exit mobile version