Home News AP Rains | తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్‌.. రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

Rains | తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్‌.. రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

Rains | తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మీదుగా రాయలసీమ నుంచి దక్షిణ జార్ఖండ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్లు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.

ఏపీలోని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు నెల్లూరు. కృష్ణా, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, ఏలూరు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. తెలంగాణలో పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

Exit mobile version