Home Latest News Bura Narsaiah Goud | తెలంగాణ మోడల్ అంటే అహంకారం, అప్పు, అవినీతా.. కేసీఆర్ పై...

Bura Narsaiah Goud | తెలంగాణ మోడల్ అంటే అహంకారం, అప్పు, అవినీతా.. కేసీఆర్ పై బూర నర్సయ్య షాకింగ్ కామెంట్స్

Bura Narsaiah Goud | బీఅర్ఎస్ అనేది వ్యక్తీ పేరా? దేశం పేరా? స్పష్టం చేయాలన్న బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ఢిల్లీకి సూటుకేసులు వెళితే.. కేసీఆర్ హాయంలో కంటైనర్ లు వెళ్తున్నాయని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. అవసరం తీరిపోయింది కాబట్టే.. కేసీఆర్ తెలంగాణ తల్లిని పక్కన పెట్టారని విమర్శించారు. ఇంతకీ తెలంగాణ తల్లి ఉన్నట్టా? లేనట్టా? అసలు తెలంగాణ మోడల్ అంటే ఏంటో.. కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

తెలంగాణ మోడల్ అంటే అహంకారం, అప్పు, అవినీతా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం అసలు ప్రాజెక్ట్ కాదు మూడు చెక్ డ్యాంలు మాత్రమే అని బూర విమర్శించారు. కేసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలాదా? ఇప్పుడు దేశ ప్రజలను మోసం చేయడానికి బయల్దేరారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు డబ్బులు అవసరం ఉంది కనుకే.. కాళేశ్వరం అదనపు టీఎంసీ అంటున్నారు అని అన్నారు . “రాష్ట్రంలో ఉన్న 63ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించబడ్డాయి. కేసీఆర్ బాధ భరించలేకనే ఎమ్మెల్యేలు.. డబ్బులిచ్చి మరీ సభ్యత్వాలు చేయించారు. కేసిఆర్ ది అప్ కి భార్ కిసాన్ సర్కార్ కాదు… ఆప్ కి బార్ బ్రస్టాచార్ సర్కార్. మద్యం బిజినెస్ పొలిటికల్ వింగ్ అవ్వనుందా” అంటూ తీవ్ర స్థాయిలో బూర ధ్వజమెత్తారు.

కేసీఆర్ కేబినెట్ లో కేవలం ముగ్గురు మాత్రమే బడుగు బలహీనర్గాలకు చెందిన మంత్రులు ఉన్నారని అన్నారు . ఆ ముగ్గురు మంత్రులకు సబ్జెక్ట్ తక్కువ….స్లొగన్స్ ఎక్కువ అంటూ విమర్శించారు. ఇకనైనా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజకీయ వెట్టి చాకిరీ మానేయాలని పిలుపునిచ్చారు. కేసిఆర్ పూజలు, యాగాలు చిత్తలేని శివపూజ లాంటివని బూర విమర్శించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

KCR Inaugurate BRS party office | ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్‌.. వాస్తుకు అనుగుణంగా జరుగుతున్న మార్పులు

Amit shah comments on congress | చైనా నుంచి కాంగ్రెస్ సంస్థకు డబ్బులు అందాయి.. కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

Congress political crisis | కాంగ్రెస్ కు రోగమొచ్చింది.. దాన్ని నయం చేయాల్సిందే.. దామోదర రాజనర్సింహా సంచలన వ్యాఖ్యలు

India-China troops clash | భారత్-చైనా సరిహద్దులో ఘర్షణపై రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో కీలక ప్రకటన..

Exit mobile version