Queen Elizabeth II | బ్రిటన్ రాణి ఎలజబెత్ II ఫొటోను కరెన్సీ నోట్లపై నుంచి తొలగిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 డాలర్ల నోట్లపై ఒకవైపు క్వీన్ ఎలిజబెత్ II ఫొటోను , మరోవైపు తమ దేశ పార్లమెంట్ ఫొటోను ఆస్ట్రేలియా ముద్రిస్తుంది. కానీ ఇకపై క్వీన్ ఎలిజబెత్ II ఫొటోను తొలగించి తమ దేశ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా కొత్త డిజైన్ నోట్లను తీసుకురావాలని ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే నోట్ల డిజైన్ మారుస్తున్నామని ప్రకటించింది. కొత్త నోటు ముద్రణకు కొంత సమయం పడుతుందని.. అప్పటి వరకు ప్రస్తుత నోటు చలామణిలో ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.
ఆస్ట్రేలియా కరెన్సీపై బ్రిటన్ క్వీన్ బొమ్మ ఎందుకు ఉంది?
ఆస్ట్రేలియాకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆ దేశ రాజ్యాధినేతగా బ్రిటీష్ చక్రవర్తి కొనసాగుతున్నారు. 1999 నాటి ప్రజాభిప్రాయ సేకరణలో కూడా బ్రిటీష్ చక్రవర్తిని దేశాధినేతగా కొనసాగించాలని తీర్పు వచ్చింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ వరకు క్వీన్ ఎలిజబెత్ II ఆస్ట్రేలియా రాజ్యాధినేతగా కొనసాగారు. క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ III బ్రిటన్ వెలుపల ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా ఇతర 12 దేశాలకు రాజ్యాధినేతగా ఉన్నారు. ఈ పదవి చాలావరకు ఉత్సవ విగ్రహం లాంటిదే. ఆస్ట్రేలియా దేశాధినేతగా గత ఏడాది వరకు బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ఉన్నది కాబట్టే ఆమె బొమ్మను తమ కరెన్సీ నోట్లపై ముద్రించింది.
కానీ క్వీన్ ఎలిజబెత్II మరణం తర్వాత కింగ్ ఛార్లెస్ III ఫొటోను తమ కరెన్సీ నోట్లపై ముద్రించేందుకు ఆస్ట్రేలియా సుముఖంగా లేదు. అందుకే 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటోను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. స్వదేశీ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా కొత్త నోట్లను తీసుకొస్తామని ప్రకటించింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Breaking News | శ్రీకాకుళం జిల్లాలో డ్రోన్ కలకలం.. మత్స్యకారులకు చిక్కిన10 అడుగుల విమానం
Nirmala Sitharaman | బడ్జెట్ ప్రసంగంలో టంగ్ స్లిప్ అయిన నిర్మలమ్మ.. సభలో విరబూసిన నవ్వులు
Andhra Pradesh Capital | ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన.. ట్విటర్ ట్రెండింగ్లో నిలిచిన విశాఖపట్నం